ఫాలో అవడం అంటే మరీ ఇలా చేయాలా...!
దోమలపై దండయాత్రలో భాగంగా కొందరు నాయకులు, అధికారులు బుక్కవుతున్నారు. డెంగ్యూ నివారణ కోసం మంత్రి కేటీఆర్ పూలకుండీలను శుభ్రపరిస్తే..వాళ్లు అదే పని చేశారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. చేసేపని వదిలి ఈ ఫోజులేంటని చురకలు అంటిస్తున్నారు.
ఫాలో అవడం అంటే మరీ ఇలా చేయాలా...!
డెంగ్యూ నివారణ కోసం మొన్నటికి మొన్న మంత్రి కేటీఆర్ తన నివాసంలో దోమలపై దండయాత్రకు దిగారు. నీటి సంపులతోపాటు పూలకుండ్లలో దోమలు లేకుండా శుభ్రపర్చారు. నాయకులు అధికారులు కూడా మంత్రి కేటీఆర్‌ను ఫాలో అయ్యారు. వాళ్లు కూడా పూలకుండీల నీళ్లనే మార్చి మమా అనిపించేశారు. వైరల్ అవుతున్న ఈ ఫొటోలపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. దోమలు పూలకుండీల దగ్గర తప్ప ఇంకెక్కడ ఉండవా అంటూ సెటైర్లు వేస్తున్నారు. నీట్‌గా టక్ చేసుకుని ఫొటోలకు ఫోజులేంటని చురకలు అంటిస్తున్నారు.