తెలంగాణ

telangana

ETV Bharat / city

"గుత్తా జ్వాల" అకాడమీ వెబ్ సైట్​ ప్రారంభం

హైదరాబాద్​ మహానగరంలో "జ్వాల గుత్తా" అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్​ వెబ్ సైట్​ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తొలుత 14 బ్యాడ్మింటన్‌ కోర్టులతో అకాడమీని ప్రారంభించామని.. భారతదేశంలోనే అతిపెద్ద అకాడమీలో ఒకటిగా పేరుపొందినట్లు జ్వాల వెల్లడించారు.

Jwala Gutta launches her badminton academy
"గుత్తా జ్వాల" అకాడమీ వెబ్ సైట్​ ప్రారంభం

By

Published : Jan 2, 2020, 7:29 PM IST

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల క్రీడా అకాడమీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్​లో గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పేరుతో దీనిని ప్రారంభించారు. తొలుత 14 బ్యాడ్మింటన్‌ కోర్టులతో అకాడమీని ప్రారంభించామని.. తర్వాత మిగిలిన కొన్ని క్రీడలకు మైదానాలు ఏర్పాటు చేసి అకాడమీ ద్వారా శిక్షణ అందిస్తామని జ్వాల వెల్లడించారు.

"గుత్తా జ్వాల" అకాడమీ వెబ్ సైట్​ ప్రారంభం

త్వరలో ప్రారంభం

ఈ కార్యక్రమానికి తెలంగాణ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో అకాడమీ ప్రారంభిస్తామని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల తెలిపారు.

భారతదేశంలోనే అతిపెద్ద అకాడమీ..

మొత్తం 14 ఆట సముదాయాలు ఉన్నాయని భారతదేశంలోనే అతిపెద్ద అకాడమీలో ఒకటిగా పేరుపొందినట్లు జ్వాల వెల్లడించారు. నిర్మాణం దాదాపు పూర్తైందని.. త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. కేవలం బ్యాడ్మింటన్​ మాత్రమే కాకుండా ప్రతి క్రీడాను అకాడమీలో శిక్షణ మెలకువలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి: రాజస్థాన్​ రాయల్స్ ఆటగాడే కోచ్​ అయ్యాడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details