తెలంగాణ

telangana

Ap corona cases: కొత్తగా 7,796 కరోనా కేసులు, 77 మరణాలు

By

Published : Jun 8, 2021, 7:50 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగాయి. గడచిన 24 గంటల్లో 89,732 మంది నమూనాలు పరీక్షించగా 7,796 కేసులు నమోదయ్యాయి.

Ap corona cases
కొత్తగా 7,796 కరోనా కేసులు, 77 మరణాలు

కొత్తగా 7,796 కరోనా కేసులు, 77 మరణాలు

ఏపీలో కొత్తగా 7,796 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 89,732 నమూనాలు పరీక్షించగా, 7,796 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. తాజాగా 14,641మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1,07,588 యాక్టివ్ కేసులు ఉండగా.., గడిచిన 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 77మంది మృత్యువాతపడ్డారు.

అత్యధికంగా చిత్తూరులో 12 మంది చనిపోగా, పశ్చిమగోదావరి 10, అనంతపురం 8, నెల్లూరు 8, శ్రీకాకుళం 7, తూర్పుగోదావరి 6, విశాఖ 6, విజయనగరం 5, గుంటూరు 4, ప్రకాశం 4, కర్నూలు 3, కడపలో 2 ప్రాణాలు విడిచారు.

ఇదీ చదవండి: Bandi sanjay: తెలంగాణకు జూన్​, జులైలో 20లక్షల చొప్పున వ్యాక్సిన్లు

ABOUT THE AUTHOR

...view details