తెలంగాణ

telangana

ETV Bharat / city

ధరణితో సులువుగా నాలా అనుమతులు.. జోష్​లో స్థిరాస్తి - ధరణి తాజా వార్తలు

భూ దస్త్రాల నిర్వహణకు సాంకేతికత జోడించి అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్‌తో భూముల మార్పిడి సేవలు వేగం అందుకున్నాయి. గతంలో దరఖాస్తు చేయడం నుంచి విచారణ, నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ విషయంలో మండలం నుంచి రెవెన్యూ డివిజన్‌ వరకు దశలవారీ ప్రక్రియ ఉండేది. తాజాగా ఆర్డీవో పరిధి నుంచి అధికారాలు తప్పించి తహసీల్దారుకు అప్పగించారు. నాలాకు స్లాట్‌ నమోదు చేసుకుంటే తిరస్కరించకుండా విధానాలను మార్చడంతో భూహక్కులు పొందడం సులువైంది. దీంతో భూమి ధరలు పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు.

నాలా ప్రక్రియ మార్పు.. స్థిరాస్తికి ఊపు
నాలా ప్రక్రియ మార్పు.. స్థిరాస్తికి ఊపు

By

Published : Jan 5, 2021, 4:28 AM IST

Updated : Jan 5, 2021, 7:04 AM IST

భూ దస్త్రాల నిర్వహణకు సాంకేతికత జోడించి అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్‌తో భూముల మార్పిడి సేవలు వేగం అందుకున్నాయి. సాగు భూమిని వ్యవసాయేతర అవసరాలకు (నాలా) వినియోగించుకునేందుకు గతంలో పెద్ద ప్రక్రియే ఉండేది. దీన్ని ధరణి పోర్టల్‌ ద్వారా సరళతరం చేయడంతో వ్యవసాయేతర భూమి హక్కులు పొందడం రైతులకు, భూ యజమానులకు సులభమైంది. గతంలో దరఖాస్తు చేయడం నుంచి విచారణ, నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ విషయంలో మండలం నుంచి రెవెన్యూ డివిజన్‌ వరకు దశలవారీ ప్రక్రియ ఉండేది. తాజాగా ఆర్డీవో పరిధి నుంచి అధికారాలు తప్పించి తహసీల్దారుకు అప్పగించారు. నాలాకు స్లాట్‌ నమోదు చేసుకుంటే తిరస్కరించకుండా విధానాలను మార్చడంతో భూహక్కులు పొందడం సులువైంది. దీంతో భూమి ధరలు పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిలోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు, నందిగాం మండలాల్లో జాతీయ రహదారి వెంట గజం విలువ గతంతో పోల్చితే రెట్టింపు అయిందని, హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిలో నకిరేకల్‌ ప్రాంతంలో వ్యవసాయ భూముల ధరలు ముప్పైశాతం వరకు పెరిగాయని రైతులంటున్నారు. డిసెంబరు నెలలో నాలా అనుమతులు పొంది 1,499 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.

53 శాతానికి..

మూడు నెలలు రిజిస్ట్రేషన్ల సేవలు నిలిపి వేయడం, కరోనాతో స్తబ్దుగా ఉన్న స్థిరాస్తి రంగం తాజాగా నాలా అనుమతులను సరళతరం చేయడంతో పుంజుకుంటోంది. గత డిసెంబరులో రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు 53 శాతానికి చేరుకున్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా డిసెంబరులో రూ.5,200 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా రూ.2,400 కోట్ల వరకు వచ్చింది. దీనికి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విధానం మార్చడం, నాలా అనుమతులు సులువుగా లభించడం ఒక కారణమని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

  • ధరణి పోర్టల్‌తో పాటు సర్వే నంబరు ఆధారంగా భూముల ధరల మదింపు విధానాన్ని మార్చడం భూముల ధరలు పెరిగేందుకు అవకాశం కల్పించింది. గతంలో గ్రామం యూనిట్‌గా భూముల ధరల మదింపు ఉండేది.
  • పోర్టల్లో సర్వే నంబరును నమోదు చేయగానే దానంతట అదే (ఆటోమేటిక్‌) ఆ భూమి ధరను లెక్కగట్టి చెబుతుంది. దీంతో నాలా అనుమతులు పొందగానే స్థిరాస్తి వ్యాపారులకు రైతులు భూములు విక్రయించుకుంటున్నారు.
  • ధరణికి ముందు స్థిరాస్తి వ్యాపారులు చాలా మంది నాలా అనుమతులు లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు చేపట్టేవారు. ఇలా వేలాది వెంచర్లు ఇప్పటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి.

ఇవీ చూడండి:జీఎస్టీ పరిహారం కింద తెలంగాణకు రూ.129 కోట్ల రుణం

Last Updated : Jan 5, 2021, 7:04 AM IST

ABOUT THE AUTHOR

...view details