తెలంగాణ

telangana

ETV Bharat / city

Lance Naik Sai Teja Death: పిల్లల్ని చూడాలని జనవరిలో వస్తానన్నారు.. అంతలోనే..

Lance Naik Sai Teja Died: హెలికాప్టర్ దుర్ఘటనలో సైనికాధికారి బిపిన్‌ రావత్ తోపాటు అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజ భార్య శ్యామల కన్నీటిపర్యంతమయ్యారు. పిల్లల్ని చూడాలనిపిస్తోందని.. జనవరిలో ఇంటికి వచ్చేస్తానని అన్నారని.. అంతలోనే ఈ దారుణం జరిగిపోయిందని.. శ్యామల విలపించారు.

Lance Naik Sai Teja died in chopper crash incident
Lance Naik Sai Teja died in chopper crash incident

By

Published : Dec 9, 2021, 7:50 PM IST

పిల్లల్ని చూడాలని జనవరిలో వస్తానన్నారు.. అంతలోనే..

Lance Naik Sai Teja Died: జనవరి నుంచి మీతోనే ఉంటానని చెప్పాడని.. అంతలోనే శాశ్వతంగా దూరమైపోయాడని అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజ భార్య శ్యామల కన్నీటిపర్యంతమయ్యారు. పిల్లల్ని చూడాలనిపిస్తోందని.. జనవరిలోనే ఇంటికి వచ్చేస్తానని చెప్పారని.. కానీ అంతలోనే దారుణం జరిగిపోయిందని కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు తమతో వీడియోకాల్ ద్వారా మాట్లాడిన సాయితేజ దూరమయ్యారంటే.. నమ్మలేకపోతున్నామని శ్యామల బోరున విలపించారు.

వాదించి మరీ సైన్యంలోకి..
Lance Naik Sai Teja Died in CDS Chopper Crash: సైన్యంలో చేరవద్దంటే వాదించి మరీ చేరాడని.. తన తమ్ముడినీ చేర్పించాడని సాయితేజ తండ్రి మోహన్ కన్నీరు పెట్టుకున్నారు. సాయితేజ మృతి సమాచారం తెలుసుకున్న బంధువులు, మిత్రులు చిత్తూరు జిల్లా ఎగువరేగడ పల్లె గ్రామానికి చేరుకుంటున్నారు. సాయితేజ అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కుటుంబసభ్యులు, గ్రామస్ధులు, స్నేహితులు సాయితేజ మృతితో కన్నీటిపర్యంతమవుతున్నారు. అతనితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని విలపిస్తున్నారు. సాయితేజ్‌కు చిన్నప్పటి నుంచి మిలటరీ విభాగమంటే చాలా ఇష్టమని.. తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని చెప్పారు. పండుగలకు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్ధులతో సంతోషంగా గడిపేవాడని గుర్తు చేసుకున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details