తెలంగాణ

telangana

ETV Bharat / city

లైవ్ అప్​డేట్స్​: పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఏపీ వాసుల ఆందోళన

రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతులు లేని ఏపీ అంబులెన్స్‌లు నిలిపివేత
రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతులు లేని ఏపీ అంబులెన్స్‌లు నిలిపివేత

By

Published : May 14, 2021, 11:10 AM IST

Updated : May 14, 2021, 1:44 PM IST

13:22 May 14

హైకోర్టులో పిల్

  • రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టులో పిల్
  • హౌజ్ మోషన్ దాఖలు చేసిన విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి వెంకటకృష్ణారావు
  • అంబులెన్స్‌లను ఆపడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరిన పిటిషనర్
  • అంబులెన్స్‌లను అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరిన పిటిషనర్
  • ఇతర రాష్ట్రాల అంబులెన్స్‌లు అనుమతించేలా ఆదేశించాలని విజ్ఞప్తి

13:21 May 14

జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను విజ్ఞప్తి

  • సూర్యాపేట: అనుమతులు లేని ఏపీ అంబులెన్స్‌లు నిలిపివేత
  • రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్ద అంబులెన్స్‌ల నిలిపివేత
  • ఆస్పత్రుల్లో పడక రిజర్వు చేసుకున్న వారికే రాష్ట్రంలోకి అనుమతి 
  • రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్దకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను
  • ఏపీ అంబులెన్స్‌లను అనుమతించాలని కోరిన ఎమ్మెల్యే ఉదయభాను
  • అనుమతి లేని వాహనాలను పంపించేదిలేదన్న రాష్ట్ర పోలీసులు

12:28 May 14

పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఏపీ వాసుల ఆందోళన

పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఏపీ వాసుల ఆందోళన
  • పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఆందోళన చేసిన ఏపీ వాసులు
  • తెలంగాణ నుంచి ఏపీలోకి వాహనాలు రాకుండా అడ్డగింత
  • పుల్లూరు చెక్‌పోస్టు వద్ద రాష్ట్ర పోలీసులతో వాగ్వాదం, తోపులాట
  • తెలంగాణలోకి రానివ్వనప్పుడు ఏపీలోకి ఎలా వస్తారంటూ ఆందోళన
  • ఏపీ భూభాగంలోకి వెళ్లి ఆందోళన చేసుకోవాలన్న రాష్ట్ర పోలీసులు

12:16 May 14

  • రామాపురం క్రాస్‌రోడ్ వద్ద అంబులెన్సులు నిలిపివేశారు: సీపీఐ నేత నారాయణ
  • ఏపీ అంబులెన్సులను వెనక్కి పంపుతున్నారు: సీపీఐ నేత నారాయణ
  • ఆస్పత్రి పత్రం చూపినా అనుమతించట్లేదు: సీపీఐ నేత నారాయణ
  • ఖాళీ అంబులెన్స్‌లను కూడా నిలిపివేస్తున్నారు: సీపీఐ నేత నారాయణ
  • సీఎం కేసీఆర్ తక్షణమే సానుకూలంగా స్పందించాలి: సీపీఐ నేత నారాయణ

11:06 May 14

పుల్లూరు చెక్‌పోస్టుకు వచ్చిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

పుల్లూరు చెక్‌పోస్టుకు వచ్చిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

పుల్లూరు చెక్‌పోస్టు సిబ్బందితో మాట్లాడిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

రాష్ట్ర ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన కర్నూలు ఎమ్మెల్యే

ఈ-పాస్‌ లేకుండా అంబులెన్సులను అనుమతించబోమన్న అధికారులు

రాష్ట్ర వైద్యాధికారులతోనూ మాట్లాడిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిని కర్నూలు ఆస్పత్రికి పంపిన ఎమ్మెల్యే

11:06 May 14

ఇతర రాష్ట్రాల కొవిడ్‌ రోగులకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు

  • ఇతర రాష్ట్రాల కొవిడ్‌ రోగులకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు
  • ముందుగా ఆస్పత్రిలో పడక రిజర్వు చేసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వం
  • కరోనా రోగులకు ఆస్పత్రుల ముందస్తు అనుమతి తప్పనిసరి
  • ఆస్పత్రుల్లో పడకలు లేక అంబులెన్సుల్లోనే ఉంటున్నట్లు గుర్తింపు
  • స్ట్రెయిన్ల వ్యాప్తికి కారణమవుతున్నారని భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం
  • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు
  • హైదరాబాద్‌: కాల్‌సెంటర్‌ నంబర్లు 040-24651119, 94944 38351
  • ఆస్పత్రి లేఖ ఉంటేనే కంట్రోల్‌ రూమ్‌ నుంచి అనుమతులు

10:47 May 14

రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతులు లేని ఏపీ అంబులెన్స్‌లు నిలిపివేత

రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతులు లేని ఏపీ అంబులెన్స్‌లు నిలిపివేత

రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్ద ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత

పుల్లూరు టోల్‌గేట్ వద్ద ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత

ఆస్పత్రుల్లో పడక రిజర్వు చేసుకున్న వారికే పోలీసుల అనుమతి 

ఆస్పత్రి నుంచి అనుమతి పత్రం పొందిన ఏపీ రోగులకు అనుమతి

కొవిడ్ కంట్రోల్ రూం అనుమతి పత్రం ఉంటేనే ఏపీ రోగులకు అనుమతి

అనుమతి లేని ఏపీ అంబులెన్స్‌లను నిలిపివేస్తున్న పోలీసులు

Last Updated : May 14, 2021, 1:44 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details