తెలంగాణ

telangana

ETV Bharat / city

కేటీఆర్‌కు నెటిజన్లు సూచించిన ఓటీటీ సినిమాలివే.. మీరు ఓ లుక్కేయండి..! - కేటీఆర్​ కాలికి గాయం

KTR Latest News: మంత్రి కేటీఆర్ కాలికి గాయం కాగా.. వైద్యులు మూడు వారాల విశ్రాంతి సూచించారు. ఈ నేపథ్యంలో.. ఏవైనా ఓటీటీ షోలకు సంబంధించి సలహాలివ్వాలంటూ ట్విట్​ చేయగా.. అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈరోజు కేటీఆర్​ పుట్టినరోజు కావడంతో సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలతో పాటు.. సినిమాలకు సంబంధించిన సూచనలు కూడా వెల్లువెత్తాయి. అవేంటో మీరూ.. ఓసారి చూసేయండి..

KTR
KTR

By

Published : Jul 24, 2022, 4:26 PM IST

KTR Latest News: కాలి గాయంతో ప్రస్తుతం మంత్రి కేటీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు(24 జులై) పుట్టినరోజు కావడంతో సామాజిక మాధ్యమాల వేదికగా కేటీఆర్​ఖు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తమ అభిమాన నాయకుడు త్వరగా కోలుకోవాలని కార్యకర్తలతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ట్విట్టర్‌ వేదికగా ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే ఓటీటీలో అలరించే సినిమాలు లేదా వెబ్‌సిరీస్‌లు ఉంటే చెప్పమని కేటీఆర్‌ అడిగినందుకు గానూ.. నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ట్విట్టర్​ వేదికగా.. తమకు నచ్చిన అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లను చూడాలని సూచించారు. అభిమానులు, సెలబ్రెటీలే కాకుండా.. ఏకంగా ఓటీటీ సంస్థలు కూడా మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు వారి సినిమాలు, సిరిస్​లు చూడాలని కోరాయి.

తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా(Aha).. కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు, త్వరగా కోలుకోవాలంటే, ‘డీజే టిల్లు' సినిమా చూడాలని వైద్యులు సూచించినట్లు ట్వీట్‌ చేసింది. అలాగే.. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ఎన్‌బీకే అన్‌స్టాపబుల్‌’, అమలాపాల్‌ నటించిన 'కుడి ఎడమైతే', ప్రియమణి 'భామాకలాపం' కూడా మిస్సవద్దని మరీమరి పేర్కొంది. మరోవైపు జీ5(ZEE5) కూడా కేటీఆర్‌కు కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లను సూచించింది. "కేటీఆర్‌ గారూ గుడ్‌ మార్నింగ్‌.. 'మా నీళ్ల ట్యాంకు'తో స్టార్ట్‌ చేసి, 'రెక్కి'తో థ్రిల్‌ అవుతూ.. లంచ్‌ టైమ్‌కి ఫ్యామిలీ మొత్తం 'ఒక చిన్న ఫ్యామిలీ' స్టోరీ కంప్లీట్‌ చేసి.. రాత్రికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' చూసేయండి. త్వరగా రికవరీ అవుతారు. కానీ.. ఒక్క విషయం జాగ్రత్త.. 'చూస్తూనే ఉండిపోతారు'".. అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ చేసింది.

ఈ క్రమంలోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రయన్‌ కూడా.. వైల్డ్‌ కంట్రీ, స్కామ్‌ 1992 సిరీస్‌లు చూడాలని సూచించటమే కాకుండా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు నెటిజన్లు కూడా మంత్రి కేటీఆర్‌కు కొన్ని సూచనలు చేశారు. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌’ వీక్షించమని ఓ నెటిజన్‌ సూచించారు. ‘పంచాయత్‌’ చూడాలని ఒకరు.. మౌస్, ‘కింగ్‌డం సీజన్‌ 1, 2’ కొరియన్‌ సిరీస్‌ల పేర్లు మరొకరు చెప్పుకొచ్చారు. డార్క్‌, గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌, మనీ హైస్ట్‌, ది బాయ్స్‌, వర్జిన్‌ రివర్‌, డీకపుల్డ్‌, ఒజార్క్‌, బెటర్‌ కాల్‌ సాల్‌, స్ట్రేంజర్‌ థింగ్స్‌, డెసిగ్నేటెడ్‌ సర్వైవర్‌, నార్కోస్‌, టెహ్రాన్‌, రాకెట్‌ బాయ్స్‌, పీకీ బ్లైండర్స్‌, బ్లాక్‌లిస్ట్‌, మిడ్‌నైట్‌ మాస్‌, హాల్ట్‌ అండ్‌ క్యాచ్‌ ఫైర్‌, హౌస్‌ ఆఫ్‌ కార్డ్స్‌, లాస్ట్‌ ఇన్‌ స్పేస్‌ తదితర షోలు సూచించారు.

మంత్రి కేటీఆర్‌ సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ఐటీ రంగ వివరాలు, పర్యటనల విశేషాలను పంచుకోవడంతోపాటు ఆయా అంశాలపై నెట్టింట తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ట్విటర్‌లో ఆయనకు 35 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అప్పుడప్పుడు ఆస్క్‌ 'కేటీఆర్' హ్యాష్‌టాగ్‌ పేరిట నెటిజన్ల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరిస్తుంటారు. ఆయా ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంటారు. ఇప్పుడు కూడా ‘ఆస్క్‌కేటీఆర్‌’(#AskKTR) పెట్టాలని కొంతమంది కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details