తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR Tweet Today : 'కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ'

KTR Tweet Today : కేంద్రాన్ని దారికి తెచ్చి తెలంగాణను సాధిస్తామని 2001లో జరిగిన సింహగర్జన సభలో కల్వకుంట్ల చంద్రశేఖర్​ రావు చేసిన ప్రకటనను అప్పటి రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారని ఐటీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఆ సభకు సంబంధించి ఆ సంవత్సరంలో ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.

KTR Tweet Today
KTR Tweet Today

By

Published : Feb 12, 2022, 10:47 AM IST

Updated : Feb 12, 2022, 11:56 AM IST

KTR Tweet Today : ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మిగతా నాయకులతో పోలిస్తే సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ముఖ్యంగా ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఎన్నో అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటారు. అంతేగాక.. ఎవరైనా సాయం కోరినా.. తమ సమస్య విన్నవించుకున్నా.. సంబంధిత శాఖల అధికారులను ట్యాగ్ చేసి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. తాజాగా కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే..

దేశంలో నంబర్ వన్.. తెలంగాణ

Minister KTR Today Tweet : '2001, మేలో సింహగర్జన సభలో కేంద్రాన్ని దారికి తెచ్చి.. తెలంగాణను సాధిస్తామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను అప్పటి రాజకీయ నాయకులు ఎగతాళి చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించి తీరతానన్న ఆయన తెగువను ఎద్దేవా చేశారు. కానీ ఇవాళ ఆయన మాటే నిజమైంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. తెలంగాణను భారతదేశంలోని రాష్ట్రాలన్నింటిలో అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దారు. ఆయన నాయకత్వం ఎంతో మందికి మార్గదర్శకం.'

- కేటీఆర్, ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి

ఎగతాళి చేశారు..

KTR Tweet about Telangana : తెలంగాణ సాధిస్తామన్న 2001 నాటి కేసీఆర్ ప్రకటన గుర్తుచేస్తూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కేసీఆర్ సాహసోపేత ప్రకటనపై అప్పటి రాజకీయ ప్రత్యర్ధులు ఎగతాళి చేశారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ నేడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు. దిల్లీ కోటలు బద్దలు కొడతానని నిన్న కేసీఆర్‌ జనగామ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు.

KTR Tweet On AP and Telangana Relation : రాష్ట్ర విభజన జరిగి రెండుగా విడిపోయినా తెలంగాణ, ఏపీ మధ్య ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. నిన్న ఆంద్రప్రదేశ్‌ మంత్రి బొత్స కుమారుడి వివాహానికి వెళ్లానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన సోదరుల ప్రేమతో పొంగిపోయానని ట్వీటారు.

Last Updated : Feb 12, 2022, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details