తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR: జీహెచ్​ఎంసీ తెరాస నేతలతో నేడు కేటీఆర్ సమావేశం - తెలంగాణ రాష్ట్ర సమితి వార్తలు

గ్రేటర్ హైదరాబాద్​లో పార్టీని బలోపేతం చేయడంపై తెరాస ప్రత్యేక దృష్టి సారించింది. నేడు పార్టీ శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ దిశానిర్దేశం చేయనున్నారు. నగరంలో డివిజన్ కమిటీలతో పాటు బస్తీ కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమైన కార్యకర్తలందరికీ పార్టీ పదవులు అప్పగించేలా ప్రణాళిక చేస్తున్నారు. భాజపా, కాంగ్రెస్‌లను ధీటుగా ఎదుర్కొనే నాయకులందరికీ పార్టీ పదవులు పంచేలా వ్యూహాలు సిద్ధం చేశారు.

KTR
KTR

By

Published : Sep 7, 2021, 4:37 AM IST

రాష్ట్ర రాజధాని నగరంపై పూర్తి పట్టు సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. సంస్థాగత కమిటీల పునర్మిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ నగర తెరాస శ్రేణుల కీలక సమావేశం నేడు జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్​లో పార్టీ కమిటీల నిర్మాణంతో పాటు అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. జలవిహార్​లో ఉదయం 10 గంటలకు జరిగే సమావేశానికి జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర ముఖ్యనేతలందరని ఆహ్వానించారు.

కార్యకర్తలు స్పందించాల్సిన తీరుపై..

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వార్డు స్థాయి, నగరాలు, పట్టణాల్లో డివిజన్ స్థాయి పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఈనెల రెండో తేదినే ప్రారంభమైంది. హైదరాబాద్​లో డివిజన్ స్థాయితో పాటు బస్తీ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని తెరాస నిర్ణయించింది. రాష్ట్ర కమిటీ, అనుబంధ సంఘాల కమిటీల్లో నగర నేతలకు ప్రాధాన్యమిచ్చే ఆలోచనలో ఉన్నారు. అన్ని కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 51 శాతం ఉంటారని కొద్ది రోజుల క్రితమే కేటీఆర్ ప్రకటించారు. కమిటీల నిర్మాణం ఎలా ఉండాలనే అంశంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కార్యకర్తలు స్పందించాల్సిన తీరుపై కేటీఆర్ వివరించనున్నారు.

వాటితో పాటు..

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కమిటీలతో పాటు.. రాష్ట్ర కమిటీ, సోషల్ మీడియా, అనుబంధ సంఘాల్లోనూ గ్రేటర్‌లోని చురుకైన కార్యకర్తలకు కీలక పదవులు ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్ తో పాటు హైదరాబాద్ లోనూ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇవీ చూడండి:Inter board: ఇంటర్ పరీక్షల విధానంలో కీలక మార్పులు

ABOUT THE AUTHOR

...view details