తెలంగాణ

telangana

ETV Bharat / city

KRMB letter : తెలుగు రాష్ట్రాలకు కేఆర్​ఎంబీ లేఖ.. వెంటనే ఆపేయాలని ఆదేశం

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ (KRMB letter to telangana, andhrapradesh) రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్​ జలాశయాల్లో విద్యుదుత్పత్తి(power generation in nagarjuna sagar)ని వెంటనే నిలిపివేయాలని లేఖలో పేర్కొంది.

krmb-wrote-a-letter-to-telangana-andhra-pradesh-states
krmb-wrote-a-letter-to-telangana-andhra-pradesh-states

By

Published : Nov 25, 2021, 9:14 PM IST

Power Generation in Nagarjunasagar: శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ (KRMB letter to Telangana, Andhra Pradesh) రాసింది. సాగు, తాగు అవసరాలకు లేకుండా.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో విద్యుదుత్పత్తి (power generation in nagarjuna sagar) చేశారని లేఖలో తెలిపింది.

విద్యుదుత్పత్తి వల్ల 56 టీఎంసీల కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలిసి పోతున్నాయని కేఆర్​ఎంబీ వెల్లడించింది. రెండు రాష్ట్రాలు నీటి వాడకం వల్ల శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 95 టీఎంసీలకు పడిపోయిందని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల కార్యదర్శులకు రాసిన లేఖలో బోర్డు పేర్కొంది. తక్షణమే విద్యుదుత్పత్తి ఆపాలని రెండు రాష్ట్రాలకు సూచించింది.

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details