ఆంధ్రప్రదేశ్‌లోని కృష్టా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నాయకుడు భాస్కర్‌రావు హత్య కేసులో మరో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. నిందితుల్లో నాంచారయ్య అలియాస్ చిన్న అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని తెలిపారు.
అసలు విభేదం ఇలా...
ప్రధాన నిందితుడు నాంచారయ్య, భాస్కర్‌రావు మధ్య కొన్ని సంవత్సరాల నుంచి విభేదాలు ఉన్నాయి. దానికితోడు.. 6 నెలల్లో వారిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు బాగా పెరిగిందని ఎస్పీ తెలిపారు. అందుకే భాస్కర్‌రావును అడ్డు తొలగించుకోవాలనే ఉద్ధేశంతో నాంచారయ్య మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కలిశారు. భాస్కర్‌రావు హత్యకు 4 రోజుల ముందు నాంచారయ్య రవీంద్రతో మాట్లాడారు. తనపేరు బయటకు రాకుండా చూడాలని మాజీ మంత్రి చెప్పారని... అనంతరం హత్య చేసేందుకు ముందుగా రెక్కీ నిర్వహించారని ఎస్పీ చెప్పారు.
రవీంద్ర అరెస్టుకు కారణం...
హత్య జరిగిన అనంతరం నిందితులు రవీంద్రతో మాట్లాడారని... కాల్ డేటాను పరిశీలించిన అనంతరమే కొల్లు రవీంద్రను అరెస్టు చేశామని కృష్టా జిల్లా ఎస్పీ చెప్పారు. నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నామని అన్నారు.