తెలంగాణకు 37.67, ఏపీకి 17 టీఎంసీలు - కృష్టా వాటర్ బోర్డ్ వార్తలు
మూడు రాజధానుల అంశంలో అసెంబ్లీ రద్దు కోసం డిమాండ్ చేసిన తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం మరోసారి మీడిమా ముందుకు రానున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సీఎం జగన్, వైకాపా నేతలు ఏం చెప్పారు.. అధికారంలోకి వచ్చాక ఎలా మాట మార్చారు.. అమరావతి కోసం కేంద్రం ఇచ్చిన నిధులు, తమ హయాంలో ఖర్చు చేసిన నిధులపై ఈ సమావేశంలో ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది.
18:35 August 05
తెలంగాణకు 37.67, ఏపీకి 17 టీఎంసీలు
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్లీ చెలరేగిన నేపథ్యంలో నీటి విడుదలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రాష్ట్రాల అవసరాల కోసం జలాలను కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం 110.4 టీఎంసీల నీటి లభ్యత ఉందని బోర్డు తెలిపింది. రెండు రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు తెలంగాణకు 37.672 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 17టీఎంసీల నీరు విడుదలకు బోర్డు అనుమతించింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణకు...
తెలంగాణ తాగు, సాగు నీటి అవసరాల కోసం జలాల విడుదలకు అనుమతిచ్చిన బోర్డు... శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 7.7టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీకి 22.1 టీఎంసీలు విడుదల చేయాలని తెలిపింది. హైదరాబాద్ తాగునీరు, మిషన్ భగీరథకు 7.7 టీఎంసీల విడుదలకు అంగీకరించింది.
ఆంధ్రప్రదేశ్‌కు..
ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం జలాల విడుదలకు అనుమతిచ్చిన బోర్డు... శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, చెన్నై తాగునీటి సరఫరాకు తొమ్మిది టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలిపింది. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ఎనిమిది టీఎంసీల విడుదలకు అనుమతించింది. గత నీటి సంవత్సరంలో మిగిలిన తమ వాటాను ఈ ఏడాదికి బదలాయించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని ఏపీ అంగీకరించలేదని, ఈ అంశంపై త్రిసభ్య కమిటీ ప్రత్యేక సమావేశంలో చర్చించాలని బోర్డు లేఖలో తెలిపింది.