తెలంగాణ

telangana

'కొత్త రెవెన్యూ చట్టం తెస్తే మంచి కంటే చెడే ఎక్కువ'

కొత్త రెవెన్యూ చట్టం తెచ్చే ముందు అందరి అభిప్రాయాలను తీసుకోవాలని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రక్షాళనా అనుభవం, పరిణామాలు.. ప్రభుత్వానికి అనేక గుణపాఠాలు నేర్పినట్లు గుర్తు చేశారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

By

Published : Aug 28, 2020, 8:05 PM IST

Published : Aug 28, 2020, 8:05 PM IST

kodandareddy demands to take exports opinion  new revenue act
'కొత్త రెవెన్యూ చట్టం తెస్తే మంచి కంటే చెడే ఎక్కువ'

కొత్త రెవెన్యూ చట్టం తెచ్చే ముందు అందరి అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు కూలంకుషంగా చర్చించాలని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాజకీయ పార్టీలతో సంప్రదించకుండా కొత్త రెవెన్యూ చట్టం తెస్తే మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. భూరికార్డుల ప్రక్షాళనా అనుభవం, పరిణామాలు.. ప్రభుత్వానికి అనేక గుణపాఠాలు నేర్పినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే పేద రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అవినీతికి ఆస్కారం లేని సమగ్ర భూమి హక్కు గ్యారంటీ చట్టం తెస్తే కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. మొదట సీసీఎల్‌ఎకు శాశ్వత అధికారిని నియమించాలని, రెవెన్యూ చట్టంపై విస్తృతంగా చర్చ జరిగేట్లు చూడాలన్నారు. 2006లో నాటి ప్రభుత్వానికి నివేదించిన ల్యాండ్‌ కమిటీ రిపోర్టును ప్రస్తుత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత అనుభవాలు, అనర్థాలు, ఆత్మహత్యలు, అవినీతి తాజా పరిస్థితులు తెలిసి.. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోవడం సరికాదని సూచించారు.

ఇవీ చూడండి:హైదరాబాద్​ కంపెనీలో అమెరికన్ టీకా ఉత్పత్తి!

ABOUT THE AUTHOR

...view details