Kodali-vangaveeti meet : ఒకరేమో ఏపీ రాష్ట్ర మంత్రి.. మరొకరు ప్రతిపక్షానికి చెందిన మాజీ ఎమ్మెల్యే. వీరిద్దరూ ఎప్పుడు కలిసినా ఏదో ఒక సంచలనమే. తాజాగా వైకాపా నాయకుడు, కృష్ణా జిల్లా గుడివాడ మాజీ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బాబ్జీ అంతిమ యాత్రలో శనివారం నాడు గుడివాడలో కలిశారు. అంతిమ యాత్ర సందర్భంగా మధ్యలో ఆటోలో కూర్చొని సేదతీరుతూ తేనీరు సేవించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటనేది ఆసక్తి నెలకొంది. దీనికి కారణం ఇటీవల కాలంలో వంగవీటి రాధా పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారమే.
Kodali Vangaveeti meet : ఆటోలో కొడాలి నాని, వంగవీటి రాధా ఏం మాట్లాడుకున్నారు? - Kodali-vangaveeti meet
Kodali-vangaveeti meet : కొడాలి నాని, వంగవీటి రాధా.. వీరిద్దరూ ఎప్పుడు కలిసినా ఏదో ఒక సంచలనమే. తాజాగా వీరిద్దరూ.. కృష్ణా జిల్లాలో గుడివాడ మాజీ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బాబ్జీ అంతిమ యాత్రలో శనివారం నాడు కలుసుకున్నారు. అనంతరం కాసేపు మాట్లాడుకున్నారు. అసలు వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారోనని.. సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గతంలో ఇద్దరూ పలు మార్లు భేటీ అయ్యారు. వంగవీటి రాధాను వైకాపాలోకి రావాలని మంత్రి నాని ఆహ్వానించినట్లు తెలిసింది. దీన్ని ఆయన సున్నితంగానే తిరస్కరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల రాధాపై హత్యకు రెక్కీ నిర్వహించారని వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబుతో సహా పలువురు నాయకులు రాధాను పరామర్శించారు. తాను పార్టీ మారడం లేదని ఈ సందర్భంగా నేతలకు చెప్పినట్లు తెలిసింది. అయినా మరోసారి మంత్రి కొడాలి నానితో కలవడం వారిద్దరూ ముచ్చటించుకోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.