తెలంగాణ

telangana

ETV Bharat / city

భాజపా నేతలపై దావా వేసిన ఎమ్మెల్సీ కవిత

Kavitha Defamation suit on BJP దిల్లీ లిక్కర్ స్కామ్​లో తెరాస ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని భాజపా నాయకులు చేస్తున్న ప్రచారం పై ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆరోపణలు చేసిన సంబంధిత వ్యక్తులపై పరువు నష్టం దావా వేశారు. బేషరతుగా వారు క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

mlc kavitha
ఎమ్మెల్సీ కవిత

By

Published : Aug 24, 2022, 6:50 AM IST

Kavitha Defamation suit on BJP: దిల్లీ లిక్కర్​ స్కామ్​లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన భాజపా నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేశారు. దిల్లీ భాజపా ఎంపీ పరవేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని కోర్టును కవిత కోరారు. వారి ఆరోపణలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని కోరారు.

ఉద్దేశ పూర్వకంగా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్ లో కవిత పేర్కొన్నారు. ప్రజల్లో తనకున్న మంచి పేరు, ప్రతిష్టను చెడగొట్టేందుకు అక్రమ పద్ధతులను ఎంచుకున్నారన్నారు. ఇక నుంచి తనపై తప్పుడు ఆరోపణలు చేయకుండా పరవేష్ వర్మ, మంజీందర్ సిర్సాలను ఆదేశిస్తూ మధ్యంతర ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కవిత కోరారు. కవిత పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details