కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథిని నాంపల్లి కోర్టు మరోసారి కస్టడీకి అనుమతించింది. ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసిన కేసులో పురోగతి కోసం కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు కోరడంతో... 2 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు 25,26 తేదీల్లో పార్థసారథిని ప్రశ్నించారు.
మరోసారి సీసీఎస్ పోలీసుల కస్టడీకి కార్వీ ఛైర్మన్ పార్థసారథి - కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథి
17:24 August 28
మరోసారి సీసీఎస్ పోలీసుల కస్టడీకి కార్వీ ఛైర్మన్ పార్థసారథి
బ్యాంకులను ఏ విధంగా మోసం చేశారనే దానికి సంబంధించి పోలీసులు అడిగిన ప్రశ్నకు పార్థసారథి నుంచి సరైన సమాధానాలు రాలేదు. అంతే కాకుండా కార్వీ అనుబంధ సంస్థలను అడ్డం పెట్టుకొని కూడా పార్థసారథి పలు మోసాలకు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇండస్ ఇండ్ బ్యాంకు కేసులో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పార్థసారథిని సీసీఎస్ పోలీసులు రేపు, ఎల్లుండి మరోసారి ప్రశ్నించనున్నారు.
ఇదీ చూడండి: