తెలంగాణ

telangana

ETV Bharat / city

'కరాటే కల్యాణి కనిపించడంలేదు.. ఆచూకీ కనిపెట్టండి' - కరాటే కల్యాణి న్యూస్

Karate Kalyanai News: పలువురు చిన్నారులను కిడ్నాప్‌ చేయడంతో పాటు 2నెలల పిల్లలను కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కరాటే కల్యాణి ఆచూకీ కనిపించడం లేదంటూ ఆమె తల్లి విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రోజు నుంచి తన కుమార్తె ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని.. కల్యాణితో పాటు దత్తపుత్రిక మౌక్తిక కూడా కనిపించడం లేదని వాపోయారు. వారిద్దరు ఎక్కడున్నారో పోలీసులే వెతికి చెప్పాలని కోరారు.

Karate Kalyanai News
Karate Kalyanai News

By

Published : May 16, 2022, 2:58 PM IST

Karate Kalyanai News: ఇటీవలే యూట్యూబ్ ప్రాంక్‌స్టర్‌ను నిలదీసిన సినీ నటి కరాటే కల్యాణి ఆ తర్వాత పలువురు చిన్నారులను కిడ్నాప్ చేయడంతో పాటు 2 నెలల పసికందును అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె కరాటే కల్యాణి, ఆమె దత్తపుత్రిక మౌక్తిక కనిపించడం లేదంటూ ఆమె తల్లి విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నుంచి కల్యాణి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని తెలిపారు. వాళ్లెక్కడున్నారో పోలీసులే వెతికి చెప్పాలని కోరారు.

ఇవీ చదవండి :కులాల వారీగా కూర్చొని తినండి.. పెళ్లి భోజనాల్లో మైక్​లో ప్రకటన

"Karate Kalyanai Latest News : ఆదివారం రోజు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నిజనిజాలేంటో అధికారులకు చెప్పాం. కల్యాణితోపాటు ఆ పాప ఇంటికి వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వాళ్లెక్కడున్నారో ఏమో భయంగా ఉంది. వీలైనంత త్వరగా పోలీసులు వారి ఆచూకీ కనిపెట్టాలి."

- విజయలక్ష్మీ, కరాటే కల్యాణి తల్లి

సంబంధిత కథనం :Karate Kalyani: నటి కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్‌ లేబర్ అధికారుల సోదాలు..

ABOUT THE AUTHOR

...view details