చిన్న చిన్న వంతెనలను పూట, ఒక్క రోజులో నిర్మించిన ఉదంతాలున్నాయి. కాస్త శ్రద్ధ చూపితే చాలు.. అవి సాకారమవుతాయి. కళాకృతులు, శిల్ప సంపదను గుదిగుచ్చి ఓ మందిరాన్ని నిర్మించడం ఆషామాషీ విషయం కాదు. కేవలం 12 గంటల్లోనే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఆ గ్రామస్థులు శభాష్ అనిపించుకున్నారు. నెలల తరబడి కొనసాగే పనులను చిత్తశుద్ధితో చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు.
ఎంత భక్తి... 12 గంటల్లోనే గుడి కట్టేశారు... - కర్నూల్ జిల్లాలో 12 గంటల్లోనే కాళికామాత ఆలయం నిర్మాణం పూర్తి
ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని పాతకందుకూరు గ్రామస్థులు... కేవలం 12 గంటల్లో ఆలయాన్ని నిర్మించి తమ భక్తిని చాటుకున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పాతకందుకూరు గ్రామస్థులు కాళికామాత మందిర నిర్మాణానికి ముందుకొచ్చారు. అందరూ కలిసి రూ.7.5 లక్షల చందాలను పోగు చేసుకున్నారు. 12 గంటల్లోనే ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆదివారం ఉదయం ఎనిమిదింటికి పనులను ప్రారంభించి రాత్రి ఎనిమిది గంటలకు పూర్తిచేశారు. నిర్మాణంలో 20 మంది శిల్పులతోపాటు వంద మంది గ్రామస్థులు పాల్గొన్నారు. ఈనెల 6న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్నారు. లోగడ గ్రామంలోని భైరవస్వామి ఆలయాన్ని కూడా గ్రామస్థులు 24 గంటల్లో నిర్మించారు.
ఇవీచూడండి: 'తిరుమల మాదిరిగా యాదాద్రి'