High Court: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ పేరు సిఫార్సు - తెలుగు వార్తలు
13:55 September 17
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు నియామకం
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు నూతన సీజేల నియామకానికి సిఫార్సునిచ్చారు. కొత్త సీజేల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ పేరు సిఫార్సు చేయగా... ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పేరు సిఫార్సు చేశారు.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఉన్నారు. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామిని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేగా సిఫార్సు చేశారు.