ఆరోగ్య బీమా, ఎక్స్‌గ్రేషియా కల్పించాలన్న డిమాండ్‌తో ఏపీలోని జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్ నేటి నుంచి సమ్మెకు దిగనున్నారు. నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలియజేయనున్నారు. నాన్ కొవిడ్ సేవలు బహిష్కరించనున్నారు. స్టైఫండ్‌లో టీడీఎస్ కటింగ్‌ను ఎత్తివేయాలని జూడాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
JUDA Strike: నేటి నుంచి సమ్మెకు దిగనున్న ఏపీ జూడాలు
నేటి నుంచి సమ్మె చేయనున్నట్లు ఏపీలోని జూనియర్ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షడు డా.రాహుల్ తెలిపారు. తమకు ఆరోగ్య బీమా, ఎక్స్‌గ్రేషియా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు.
నేటి నుంచి సమ్మెకు దిగనున్న ఏపీ జూడాలు
సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామంటున్న జూనియర్ వైద్యులు....ఈ నెల 10న కొవిడ్ విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. 11న నాన్ కొవిడ్ అత్యవసర విధుల బహిష్కరణ... 12న కొవిడ్ విధుల అత్యవసరసేవల బహిష్కరణను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. నేడు డీఎంఈ, వైద్యశాఖమంత్రితో సమావేశమై సమస్యలపై చర్చిస్తామని జూడాల ఏపీ అధ్యక్షులు రాహుల్ తెలిపారు. మరోవైపు జూడాల సమ్మెకు తెలుగు యువత మద్దతు ప్రకటించింది.