రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్క లేదనే మనస్తాపంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బయటకు వచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఆదిలాబాద్ పట్టణం శాంతినగర్‌లోని స్వగృహానికి చేరుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అనుచరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో ప్రశాంత్ అనే కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడడం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. వెంటనే తేరుకున్న సహచరులు, పోలీసులు ప్రశాంత్ ఒంటిపై నీళ్లు పోసి అడ్డుకున్నారు.
అనుచరుల ముందు జోగు రామన్న కంటతడి - jogu ramanna
అజ్ఞాతంలోకి వెళ్లిన జోగు రామన్న ఆదిలాబాద్‌లోని స్వగృహానికి చేరుకున్నారు. మంత్రి పదవి దక్కకపోవడం బాధ కలిగించిందని కంటతడి పెట్టారు. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని కోరారు.
కార్యకర్తలు ఆందోళనలు చెందవద్దంటూ మనోధైర్యం నింపే ప్రయత్నంలో జోగు రామన్న ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఎదిగిన తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించానని కంటతడిపెట్టారు. మంత్రిపదవి రానందున మనస్తాపానికి గురై, బీపీ పెరిగినట్లు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు. వైద్యుల సూచన మేరకే చరవాణి స్విచ్ ఆఫ్ చేసినట్లు వివరించారు. తమ నాయకుడు కేసీఆరేనని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: మున్సిపాల్టీల్లో తెరాస విజయం కోసం కేటీఆర్ కసరత్తు