కాసేపట్లో కేసీఆర్తో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ భేటీ - jharkhand cm meets CM KCR
10:30 June 04
హైదరాబాద్‌కు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్
ఝూర్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఇవాళ ఆయన.. సీఎం కేసీఆర్ను కలవనున్నారు. ఈ భేటీలో దేశ రాజకీయాలతో పాటు కేంద్ర సర్కార్ వైఖరి.. ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని.. త్వరలోనే ఓ సంచలన జరగబోతోందని ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది.
మరోవైపు హేమంత్ సొరేన్ కేసీఆర్ను కలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో ఝూర్ఖండ్ సీఎం హైదరాబాద్లో కుటుంబ సమేతంగా పర్యటించారు. వివిధ పనుల నిమిత్తం అప్పుడు హైదరాబాద్ వచ్చిన హేమంత్.. అప్పుడు కేసీఆర్తో భేటీ అయ్యారు. మరోవైపు ఇటీవలే సీఎం కేసీఆర్ కూడా రాంచీ వెళ్లి ఝార్ఖండ్ ముఖ్యమంత్రిని కలిశారు.