JC Diwakar Reddy About Job Notifications : ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం హర్షించతగినదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 91 వేల పోస్టుల భర్తీ చరిత్రలో మొదటిసారి అని తెలిపారు. జగన్ 3 రాజధానులను వదిలేసినట్లే కనిపిస్తోందని అన్నారు. ఏపీలో ఉద్యోగాల గురించి ప్రస్తావన రాగా.. తమ రాష్ట్రంలో డబ్బులే లేవని ఇక ఉద్యోగాల మాట దేవుడెరుగు అని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రభుత్వానికి డబ్బులు పంచడమే తెలుసని ఎద్దేవా చేశారు.
'తెలంగాణలో 91వేల ఉద్యోగాల భర్తీ.. ఏపీలో ఉద్యోగుల జీతాలకే దిక్కులేదు' - ఉద్యోగాల ప్రకటనపై జేసీ దివాకర్ స్టేట్మెంట్స్
JC Diwakar Reddy : 91 వేల పోస్టుల భర్తీ చరిత్రలో మొదటిసారి అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఏపీలో ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేవని ఎద్దేవా చేశారు. ఒకప్పటిలా సీఎంలను కలిసే పరిస్థితులు లేవన్న జేసీ దివాకర్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌ను కలుద్దామని వెళ్లినా వీలు కాలేదని తెలిపారు.
JC Diwakar Reddy
"ఒకప్పటిలా ముఖ్యమంత్రులను కలిసే పరిస్థితులు లేవు. సీఎం కేసీఆర్‌ను కలుద్దామని వెళ్లినా వీలు కాలేదు. అపాయింట్మెంట్ ఉంటే పిలుస్తామన్నారు. ఇప్పటికీ పిలవలేదు. ఏపీలో మంత్రులకే సీఎం అపాయింట్మెంట్ దొరకట్లేదు."
- జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎంపీ