తెలంగాణ

telangana

ETV Bharat / city

రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదు: పవన్​ కల్యాణ్​ - nellore latest news

రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో ఆయన పర్యటించారు. మద్యం విక్రయాలతో వచ్చిన ఆదాయాన్ని రైతులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదు: పవన్​ కల్యాణ్​
రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదు: పవన్​ కల్యాణ్​

By

Published : Dec 5, 2020, 10:55 AM IST

ఏపీలోని నెల్లూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకున్నారు. తుపానుతో పంట నష్టపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారని చెప్పారు. వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కావలిలో అక్రమ లే అవుట్ వల్ల వరద నీరు బయటకు పోవట్లేదని చెప్పారు. నష్టపోయిన రైతులకు భరోసా, మనోధైర్యం ఇవ్వడం కోసం తాను వచ్చానని జనసేనాని తెలిపారు.

రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని చెప్పారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అయినా రైతులకు కేటాయించాలని పవన్ అన్నారు. జగన్​ ప్రభుత్వం స్పందించకపోతే రైతులకు మద్దతుగా ఈనెల 7న నిరసన దీక్షలు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రజలు మార్పును కోరుకుంటున్న విషయం అర్థమైందని పవన్ చెప్పారు.

ఇదీ చదవండి:తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: పవన్​

ABOUT THE AUTHOR

...view details