తెలంగాణ

telangana

ETV Bharat / city

సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణ 16కి వాయిదా పడింది. నిమ్మగడ్డ ప్రసాద్ అభ్యర్థనపై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. విదేశాలకు వెళ్లేలా బెయిల్ షరతులు సడలించాలని నిమ్మగడ్డ ప్రసాద్ అభ్యర్థనపై నిర్ణయం రేపటికి వాయిదా పడింది.

By

Published : Feb 9, 2021, 7:02 PM IST

jagan
jagan

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్​కు బెయిల్ షరతులు సడలించవద్దని సీబీఐ కోరింది. విదేశాలకు వెళ్లేలా ఆరు నెలల పాటు బెయిల్ షరతులు సడలించాలన్న నిమ్మగడ్డ ప్రసాద్ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం నిర్ణయం రేపటికి వాయిదా వేసింది.

పెన్నా ప్రతాప్ రెడ్డి, రఘురాం సిమెంట్స్ డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విన్న సీబీఐ కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. పెన్నా సిమెంట్స్ కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలు చేసేందుకు న్యాయస్థానం సీబీఐ చివరి అవకాశాన్ని ఇచ్చింది.

ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 16కి కోర్టు వాయిదా వేసింది. ఓఎంసీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. శ్రీలక్ష్మి పిటిషన్​పై విచారణను ఈనెల 16కి కోర్టు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్త బార్ల ఏర్పాటు దరఖాస్తుల గడువు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details