ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ విజయం సాధించారు. ప్రత్యర్థి రంగారావుపై 13 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా జగదీశ్వర్ ఎన్నికయ్యారు. అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ 4 స్థానాలకు ఏడుగురు పోటీ చేశారు. 3 స్థానాల్లో రంగారావు ప్యానెల్‌కు చెందిన మల్లారెడ్డి, నార్మన్ఐస్సాక్, రామకృష్ణ గెలుపొందారు. ఒక స్థానానికి జయేశ్ ప్యానెల్‌కు చెందిన సోమేశ్వర్ విజయం సాధించారు.
ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జయేశ్ రంజన్
ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ విజయం సాధించారు. 84 మంది సభ్యులకు గాను 81 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
jayesh ranjan
రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా రామకృష్ణ, ఇస్మాయిల్ భేగ్, హంజా, అబ్బాస్, దత్తాత్రేయ, మహేందర్‌రెడ్డి, పురుషోత్తం, రాం కోటేశ్వరరావు, స్వామి, ఖాజాఖాన్ విజయం సాధించారు. జిల్లా ఈసీ మెంబర్లుగా విజయం సాధించిన రాజేంద్రప్రసాద్, అజీజ్ ఖాన్, జనార్దన్‌రెడ్డి, లింగయ్య, మనోహర్ గెలుపొందారు. కోశాధికారి పదవికి రంగారావు ప్యానల్ అభ్యర్థి మహేశ్వర్ ఎన్నికయ్యారు.
ఇదీ చూడండి:ఆ సామర్థ్యం దిల్లీ తర్వాత హైదరాబాద్‌కే!
Last Updated : Feb 9, 2020, 11:28 PM IST