తెలంగాణ

telangana

ETV Bharat / city

పీఎస్​ఎల్వీ- సీ 48 ప్రయోగం విజయవంతం

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సత్తా మరోసారి రుజువైంది. నమ్మినబంటు పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నమ్మకాన్ని నిలబెట్టిన వేళ... గగనవీధిలో త్రివర్ణపతాకం మరోసారి రెపరెపలాడింది. శ్రీహరికోటలోని సతీశ్​ ధవన్ స్పేస్ సెంటర్‌ నుంచి పీఎస్​ఎల్వీ- సీ 48 ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా చేపట్టింది.

pslv c 48
pslv c 48

By

Published : Dec 11, 2019, 4:55 PM IST

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ సత్తా ప్రపంచదేశాలకు మరోసారి తెలిసొచ్చింది. శ్రీహరికోట వేదికగా నిర్వహించిన పీఎస్‌ఎల్‌వీ- సీ 48 ప్రయోగం విజయవంతమైంది. 3 గంటల 35 నిమిషాలకు నిప్పులు కక్కుకుంటూ నింగికెగిరిన పీఎస్‌ఎల్‌వీ- సీ 48 వాహక నౌక రీశాట్-2బీఆర్​1 ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన మరో తొమ్మిది ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. రీశాట్- 2బీఆర్‌ 1 ఉపగ్రహాన్ని 576 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనితోపాటు అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలు, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్‌కు చెందిన ఒక్కొక్క ఉపగ్రహాన్ని ఇస్రో నిర్ణీత కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశపెట్టింది.

పీఎస్​ఎల్వీ- సీ 48 ప్రయోగం విజయవంతం

ఐదేళ్ల పాటు సేవలు
రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ రీశాట్-2 బీఆర్​ 1 బరువు 628 కేజీలు కాగా వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఈ ఉపగ్రహం సేవలందించనుంది. మొత్తం ఐదేళ్ల పాటు రీశాట్-2 బీఆర్​1 సేవలందిస్తుంది. ఈ ఏడాది మే 22న విజయవంతంగా ప్రయోగించిన రీశాట్‌-2బీకి కొనసాగింపుగా ఈ ప్రయోగం చేపట్టారు.

576 కి.మీ. కక్ష్యలోకి

పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతం కావడం సంతోషంగా ఉందని ఇస్రో ఛైర్మన్ శివన్ అన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-48 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో 50వ ప్రయోగమని... షార్‌ నుంచి చేపట్టిన 75వ ప్రయోగమని వెల్లడించారు. 576 కిలోమీటర్ల కక్ష్యలోకి రీశాట్‌ 2బీఆర్‌1 ఉపగ్రహం ప్రవేశపెట్టామని ప్రకటించారు. ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తల బృందానికి శివన్ అభినందనలు తెలిపారు.

పీఎస్​ఎల్వీ- సీ 48 ప్రయోగం విజయవంతం

ఇదీ చూడండి: పలకరింపులు, ప్రారంభోత్సవాలతో సాగిన సీఎం కేసీఆర్​ పర్యటన

ABOUT THE AUTHOR

...view details