తెలంగాణ

telangana

ETV Bharat / city

Drug Mafia: ఒక్కొక్కటిగా బయటపడుతున్న మత్తు మాఫియా లీలలు

హైదరాబాద్​ కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రిన్‌ పట్టుబడిన వ్యవహారంలో ఎక్సైజ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మత్తు మాఫియా లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. పరారీలో ఉన్న కీలకసూత్రధారులు కేఎస్‌ రెడ్డితో పాటు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Drug Mafia in hyderabad
Drug Mafia in hyderabad

By

Published : Nov 8, 2021, 5:26 AM IST

Updated : Nov 8, 2021, 6:36 AM IST

మత్తుమాఫియా బరితెగింపు ఎక్సైజ్‌ పోలీసుల విచారణలో బయటపడుతోంది. ఇటీవల బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు కూకట్‌పల్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న కీలకసూత్రదారులు హన్మంతరెడ్డి, కె.ఎస్‌.రెడ్డి కోసం గాలిస్తున్నారు. కొద్దిరోజుల కిందట హన్మంతరెడ్డి కోర్టు ద్వారా పోలీసులకు లొంగిపోయాడు. రామకృష్ణగౌడ్‌, హన్మంతరెడ్డిని ఎక్సైజ్‌ పోలీసులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. వారి చ్చిన సమాచారంతో బావాజీపల్లి, నాగర్‌కర్నూల్‌, చింతల్‌, కరీంనగర్‌, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో సోదాలు జరిపారు. మత్తుపదార్థాలు, వాటి సమాచారం లేకపోవటంతో వెనుదిరిగినట్లు సమాచారం. ప్రధాన సూత్రధారి ఎస్‌కేరెడ్డి నివాసంలో కీలక సమాచారం గుర్తించినట్లు తెలిసింది. మెఫిడ్రిన్‌, అల్ఫోజోలం వంటి ముడి సరకును ఏ విధంగా తయారు చేయాలనే వివరాలు, ఫార్ములాకు సంబంధించిన అంశాలతో ఉన్న రికార్డులను గుర్తించారు. అతడు పట్టుబడితే అసలు గుట్టు బయటపడుతుందని అబ్కారీ అధికారులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు హన్మంతరెడ్డి 2015లో 132 కిలోల అల్ఫోజోలం తరలిస్తుండగా డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. ఇతడిపై మూడు కేసులున్నట్టు సమాచారం.

ఎవరీ ఎస్‌కేరెడ్డి?

నాగర్‌కర్నూల్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్న సురేష్‌రెడ్డి అలియాస్‌ ఎస్‌కేరెడ్డి వివిధ మారుపేర్లతో మాదకద్రవ్యాలు రవాణా చేసేవాడు. ఫార్మా కంపెనీల్లో మేనేజర్‌గా పనిచేసిన అనుభవంతో ఖాయిలాపడిన ఫార్మా పరిశ్రమను లీజుకు తీసుకొని, మెఫిడ్రిన్‌ తయారు చేస్తూ బెంగళూరు, గోవా, చెన్నై, ముంబయి తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు సమాచారం. సెల్‌ఫోన్లను ఉపయోగిస్తే దొరికిపోతామనే ఉద్దేశంతో ముఖాముఖీ లావాదేవీలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవాడని తెలుస్తోంది. తన అనుచరులు, సరఫరా చేసేవారికి పాత సెల్‌ఫోన్లు, నకిలీ వివరాలతో కొనుగోలు చేసిన సిమ్‌కార్డులు ఇచ్చి, వాటి ద్వారా లావాదేవీలు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చేవాడని సమాచారం.

రండి.. ఆస్వాదించండి

మత్తు మాఫియా సభ్యులు శివార్లలోని పలు ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌ల్లో వారాంతాల్లో రేవ్‌పార్టీ, ముజ్రా పార్టీలు ఏర్పాటు చేసి యువతకు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఆహ్వానం పంపుతారు. ఎంట్రీ ఫీజు రూ.1,500 నుంచి రూ.3 వేల వరకూ వసూలు చేస్తారు. మద్యం, మెఫిడ్రిన్‌ కొద్దిమొత్తంలో ఇస్తారు. అలవాటు పడినవారికి మెఫిడ్రిన్‌ గ్రాము రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకూ విక్రయిస్తున్నారు.

ఇదీచూడండి:డ్రగ్స్ కేసులో ఎన్​సీబీ విచారణకు ఆర్యన్​ఖాన్​ డుమ్మా

Last Updated : Nov 8, 2021, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details