తెలంగాణ

telangana

ETV Bharat / city

'హార్ట్​ స్పెషలిస్ట్​ అవుతా.. తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తా..'

లక్షలు పోసి చదువు'కొంటున్న' ప్రైవేటు కళాశాలలకు సర్కారు కాలేజేం తక్కువ కాదని నిరూపించింది సౌజన్య. కష్టపడి చదివితే... విజయం దానంతట అదే దరి చేరుతుందంటోంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు కైవసం చేసుకున్న సౌజన్య... తన భవిష్యత్ లక్ష్యాలు ఈటీవీ భారత్​తో పంచుకుంది.

intermediate first year topper sowjanya with etv bharat
హర్ట్​ స్పెషలిస్ట్​ అవుతా.. తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తా

By

Published : Jun 21, 2020, 5:52 PM IST

Updated : Jun 21, 2020, 7:31 PM IST

ఇష్టపడి పడితే అనుకున్న లక్ష్యాలను సాధించడం తేలికే అంటోంది సౌజన్య. ముషీరాబాద్ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న చంద్రమౌళి-సరోజ దంపతుల ఇద్దరు కూతుళ్లలో ఒకరే సౌజన్య. తండ్రి అర్చకుడిగా పనిచేస్తూనే... పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆకాంక్షించారు. పిల్లల ఉన్నతి కోసం నిరంతరం కష్టపడ్డారు. అందుకు తగ్గట్లుగా పిల్లలు సైతం కష్టపడి చదుకున్నారు.

హార్ట్​ స్పెషలిస్ట్​ అవుతా.. తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తా

సర్కారు చదువేం తక్కువ..?

ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో సౌజన్య బీపీసీ విభాగంలో 440 మార్కులకు 431 సాధించింది. సౌజన్య సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్​లోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల గురుకుల జూనియర్ కళాశాల (ఎంజేపీటీబీసీడబ్ల్యూ)లో చదువుతోంది. అధ్యాపకుల ప్రోత్సాహం వల్లే అత్యధిక మార్కులు సాధించడం సులభమైందంటున్న సౌజన్య... హార్ట్ స్పెషలిస్ట్ కావడమే తన లక్ష్యమన్నారు. అందరికి తక్కువ ఖర్చులో వైద్యం అందించేలా కృషి చేస్తానన్నారు.

పిల్లలే ప్రపంచం..

పిల్లలు కష్టపడి చదువుతుంటే తండ్రి చంద్రమౌళి అర్చకుడిగా పనిచేస్తూనే... మరోపక్క తెలంగాణ మానవ హక్కుల కౌన్సిల్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా... తన పనిగా భావించి చేతనైన సాయం చేస్తాడు. ఇప్పటికీ... తన పిల్లలతోపాటు తానూ చదువుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎల్ఎల్​బీ పూర్తి చేసిన చంద్రమౌళి... ఇప్పుడు ఎల్​ఎల్​ఎం చేస్తున్నారు. పిల్లలతో కలిసి తాను చదువుకుంటున్నారు. నిరుపేద కుటుంబం అయినప్పటికీ... పిల్లలకు ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నానని చెప్తున్నారు. పిల్లలే తన ప్రపంచం అని... వాళ్లను ఉన్నత చదువులు చదివించడమే తన లక్ష్యమంటున్నారు.

ప్రభుత్వ కళాశాలలో కష్టపడి చదివి... అత్యధిక మార్కులు సాధించిన సౌజన్య... ద్వితీయ సంవత్సరంలోనూ అత్యుత్తమ మార్కులు సాధించి... హార్ట్ స్పెషలిస్ట్ కావాలని ఆకాంక్షిద్దాం...

ఇదీ చూడండి:ఫాదర్స్ డే కోసం తెలుగు-వెలుగు అందిస్తున్న ప్రత్యేక సూక్తులు

Last Updated : Jun 21, 2020, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details