మంత్రి కేటీఆర్ కార్యాలయంలో పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు అందించారు. డీమార్ట్కి చెందిన రాధా కిషన్ ధమని తన బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా రూ.5కోట్ల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. బల్క్ డ్రగ్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు రూ. 35 లక్షల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్కు అందించారు. సైబర్ హోమ్స్ రూ.50 లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి అందించారు. ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్ రూ.10 లక్షల రూపాయలు, శ్రీ మారుతీ సుందర్ అసోసియేట్స్, వెస్ట్రాక్ వెంచర్స్, మాధవ రెడ్డి విజ్జలి, ప్రియాశర్మ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు సైతం రూ. 5 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.
సీఎం సహాయనిధికి వెల్లువెత్తుతున్న విరాళాలు - Industrialists donation To CMRF Telangana
కరోనా కట్టడికి ప్రభుత్వానికి మద్ధతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ కార్యాలయంలో పలువురు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు.
సీఎం సహాయనిధికి వెల్లువెత్తుతున్న విరాళాలు
TAGGED:
cmrf