రైల్వే స్మార్ట్ కార్డు వినియోగదారులు నేరుగా ఆన్లైన్ ద్వారా రీఛార్జీ చేసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి అన్ని డిజిటల్ విధానాల ద్వారా చెల్లింపులు చేయవచ్చని తెలిపింది.
Railway smart cards: మీరు రైల్వే స్మార్ట్ కార్డు వినియోగిస్తున్నారా..? - railways smart card recharge news
రైల్వే స్మార్ట్ కార్డులున్న వినియోగదారులు.. వెబ్‌పోర్టల్ ద్వారా రీచార్జీ చేసుకొనే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. గతంలో స్మార్ట్ కార్డుల రీఛార్జీ కోసం ప్రతిసారి బుకింగ్ కౌంటర్లకు వెళ్లాల్సి వచ్చేది.
indian railways ticket booking
గతంలో స్మార్ట్ కార్డుల రీఛార్జీ కోసం ప్రతిసారీ రైల్వే బుకింగ్ కౌంటర్లకు వెళ్లవలసి వచ్చేది. ఇప్పటికే ప్రయాణికుల సౌకర్యం కోసం యూటీఎస్ ఆన్ మొబైల్, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎమ్‌లు), కరెన్సీ ఆపరేటెడ్ టికెట్ వెండింగ్ మెషిన్లు (సీఓటీవీఎమ్‌లు) వంటి అనేక డిజిటల్ పద్ధతులను ప్రవేశ పెట్టినట్లు అధికారులు తెలిపారు.