తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం అనేక మంది పొట్టకూటికోసం ఎడారి దేశాలకు వలసవెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నారని గల్ఫ్ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు బసంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించకపోవడం వల్ల యువతి, యువకులు అప్పు చేసి సౌదీ, దుబాయ్, కువైట్ లాంటి దేశాలకు వెళ్తున్నారని తెలిపారు. సుమారు 15 లక్షల మందికిపైగా ఎడారి దేశాల్లో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని వెల్లడించిన బసంత్ రెడ్డి... తన వంతు సామాజిక బాధ్యతగా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు నేనున్నానంటున్న నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ వాసి బసంత్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖి.
'కేంద్రం చొరవ చూపితే... గల్ఫ్ బాధితులకు కష్టాలుండవ్' - బసంత్ రెడ్డి
పొట్ట చేతపట్టుకొని ఎడారి దేశాలకు వలసపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు పుట్టేడు కష్టాలు అనుభవిస్తున్నారని గల్ఫ్ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు బసంత్ రెడ్డి స్పష్టం చేశారు. నకిలీఏజెంట్ల మోసాలతో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. పొరు దేశాల్లో మగ్గుతున్న వారిని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఔట్ పాస్ విధానం ద్వారా స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Gulf victims