తెలంగాణ

telangana

ETV Bharat / city

వినూత్న ఆలోచనకు శ్రీకారం.. ప్రమాదాల నివారణే ధ్వేయం - hyderabad latest newsA

ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించటానికి రవాణాశాఖ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయం గోడలపై నిబంధనలకు సంబంధించిన చిత్రాలను వేయిస్తోంది. వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చిత్రాల రూపంలో తెలిపేందుకు ప్రయత్నిస్తోంది.

traffic police awareness
వినూత్న ఆలోచనకు శ్రీకారం.. ప్రమాదాల నివారణే ధ్వేయం

By

Published : Apr 19, 2021, 7:56 PM IST

వినూత్న ఆలోచనకు శ్రీకారం.. ప్రమాదాల నివారణే ధ్వేయం

రహదారిపై వెళ్లేటప్పుడు చాలామంది వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించడం లేదు. ఫలితంగా ఇటీవల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిమానాలు విధిస్తున్నా... ఆశించిన ఫలితం రావటం లేదు. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించిన రవాణా శాఖ... వినూత్న ఆలోచన చేసింది.

నిబంధనల చిత్రాలు..

వాహనదారులకు నిబంధనలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయం గోడలకు నిబంధనలు తెలిపే చిత్రాలను వేయించింది. హెల్మెట్‌ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని... చెప్పే చిత్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.

కొందరిలోనైనా..

రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటమే తమ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. ఈ చిత్రాల వల్ల కొందరిలోనయినా అవగాహన కలుగుతుందన్నారు. గత వారం రోజులుగా రవాణా శాఖ కార్యాలయం వద్ద చిత్రాలను గీస్తున్నామని చిత్రకారులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని వివరించారు.

వాహనదారుల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటోంది.

ఇవీచూడండి:ప్ర‌మాద బీమా అవసరం ఎంత‌?

ABOUT THE AUTHOR

...view details