ఇటీవల కురిసిన వర్షాలతో హిమాయత్‌సాగర్ జలాశయంలోకి 4.44 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్టు జలమండలి ఎండీ దానకిషోర్ వెల్లడించారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్‌తో కలిసి దానకిషోర్ సందర్శించారు. గేట్లు ఎత్తి 4.39 లక్షల క్యూసెక్కుల నీటిని మూసిలోకి వదిలినట్టు తెలిపారు. నీటి విడుదల సమయంలో లోతట్టు ప్రాంతవాసులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు వివరించారు. వర్షాలతో హిమాయత్‌సాగర్‌తో పాటు, ఉస్మాన్‌సాగర్‌లోకి కూడా భారీగా వరద నీరు వస్తోందన్నారు.
వర్షాలతో హిమాయత్‌సాగర్‌లోకి 4.44లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - హిమాయత్‌సాగర్‌ను సందర్శించిన జలమండలి ఎండీ
వర్షాలతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరినట్టు హైదరాబాద్ జలమండలి ఎండీ దాన కిషోర్ తెలిపారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్‌తో కలిసి హిమాయత్‌సాగర్‌ను సందర్శించారు.
పాతబస్తీలోని బహదూర్‌పుర నియోజకవర్గంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో దాన కిషోర్ పర్యటించారు. హషామాబాద్, అల్జుబైల్ కాలనీ, కబీర్‌నగర్, గాజీమిల్లత్ కాలనీల్లో పర్యటించి తాగునీటి సరఫరా, వాటర్ ట్యాంకర్లు, క్లోరిన్ మాత్రల పంపిణీల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో పైపులైన్లు ధ్వంసం అయిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి:వరదల నుంచి కోలుకోకముందే హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం