హైదరాబాద్‌కి చెందిన అరవింద్ ఇక్కడేబీటెక్ చదివాడు. విదేశాల్లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశాడు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. అరవింద్‌కి వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే.. విదేశాలకెళ్లి బిజినెస్ మాస్టర్స్ చదివాడు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగివచ్చాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తునే.. వ్యాపారం చేయాలనే ఆకాంక్షతో యాప్‌ను రూపొందించాడు.
ఐడియా ఇలా వచ్చింది!
అరవింద్ పని చేసే ఆఫీస్‌లో పార్కింగ్ కోసం నెలకు 2 వేలు కడుతున్నాడు. అప్పుడే.. అరవింద్‌కి ఓ ఐడియా వచ్చింది. అపార్ట్మెంట్లలో ఖాళీస్థలం ఉన్న వాళ్లు దాన్ని పార్కింగ్ కోసం అద్దెకిస్తే ఆదాయం వస్తుంది కదా అని ఆలోచించాడు. గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్లలో ఉంటూ సొంత వాహనం లేని వారు, వారి వాహనానికి పార్కింగ్ అవసరం లేని సమయంలో స్థలాన్ని అద్దెకి ఇవ్వవచ్చు. అలా చేయాలనుకున్న వాళ్లకోసం ఒక యాప్ డిజైన్ చేశాడు. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని రిజిష్టర్ చేసుకోవాలి. పార్కింగ్ స్థలం కావాల్సిన వాళ్లు కూడా యాప్‌ని ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ కావాలి. కొత్త ప్రాంతంలోకి వెళ్లిన వారు తమ వాహనాన్ని పార్క్ చేయాలనుకుంటే.. ఈ యాప్‌లో సెర్చ్ చేస్తే చేయాలి. లేదంటే.. ముందే బుక్ చేసి పెట్టోకోవచ్చు. ఇక స్థల యజమానులు కూడా తమ స్థలం పార్కింగ్ కోసం ఫలానా టైమ్‌లో ఖాళీగా ఉంటుంది అని యాప్‌లో అప్డేట్ పెట్టాలి. ఆ చుట్టుపక్కల వచ్చిన కొత్త వాహనాదారులకు ఆటోమేటిక్‌గా పార్కింగ్ స్థలం గురించి తెలిసిపోతుంది. బస్‌స్టాప్, రైల్వేస్టేషన్‌లోనూ యాప్‌ను వాడొచ్చు. అక్కడికి వెళ్లే ముందు పార్కింగ్ స్పేస్ ఉందో, లేదో చూసుకొని బుకింగ్ చేసుకోవచ్చు. వాహనదారులకు బాగా ఉపయోగపడే ఈ యాప్‌ను లాక్‌డౌన్ తర్వాత అందుబాటులోకి తీసుకురానున్నట్లు అరవింద్ చెప్పారు.