'మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రజల్ని రక్షించగలం' అని పోలీసు అధికారులకు హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్ అన్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండటం ఒక్కటే మార్గమని సూచించారు. నగర పోలీసులంతా వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు.
'మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రజల్ని రక్షించగలం' - కరోనాపై సీపీ అంజనీ కుమార్ ట్వీట్
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి హైదరాబాద్ పోలీసు అధికారులంతా వ్యక్తిగత పరిశుభ్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని నగర సీపీ అంజనీ కుమార్ సూచించారు. తరచుగా చేతులు కడగడం, జలుబు, దగ్గుతో బాధపడే వారికి దూరంగా ఉండాలని చెప్పారు.
'మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రజల్ని రక్షించగలం'
ప్రతి పోలీసు అధికారి జీవితం ప్రజల ఆరోగ్యం, రక్షణకే అంకితమని అందుకే ఆరోగ్యకరంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తున్నందున సీపీ అంజనీకుమార్ ట్వీట్ చేశారు.
- ఇదీ చదవండి:జలుబు, ఫ్లూ, కరోనా మధ్య తేడా ఏంటి?