ప్రసూతి ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళపై భర్త అనుమానంతో దాడి చేసిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం దుర్గసముద్రంలో జరిగింది. గ్రామానికి చెందిన త్రివేణి, శరణ్ భార్యభర్తలు. త్రివేణి తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సపోర్ట్ స్టాఫ్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శరణ్ అనుమానంతో విధులకు హాజరుకావొద్దంటూ రోజూ భార్యను వేధించేవాడు. తన మాటలు వినకుండా విధులకు హాజరైందని త్రివేణిపై దాడికి పాల్పడ్డాడు.
ఉద్యోగం మానటం లేదని భార్యపై భర్త దాడి - tirupathi news
కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సి భర్తే.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఆమెను ఉద్యోగానికి వెళ్లొద్దంటూ వేధించాడు. తన మాట వినకుండా విధులకు హాజరైనందుకు దాడి చేశాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం దుర్గసముద్రంలో జరిగింది.
ఉద్యోగం మానటం లేదని భార్యపై భర్త దాడి
విషయం తెలుసుకున్న త్రివేణి సోదరుడు శ్రీనివాసులు ఆమెను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. ఈ ఘటనపై ముత్యాలరెడ్డిపల్లి సీఐ సురేందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: రక్తబంధం రాక్షసత్వం.. భూ తగాదాలో అన్న హత్యకు కుట్ర