తెలంగాణ

telangana

ETV Bharat / city

'బండి'​పై దాడికి నిరసనగా ఉపవాస దీక్ష - obc morcha president laxman hunger protest in bjp state office nampally

నిన్న రాత్రి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ వాహనంపై జరిగిన దాడిపై ఆ పార్టీ నేతలు భాజపా నేతలు లక్ష్మణ్​, అరుణ స్పందించారు. ఎన్నికల దృష్ట్యా తెరాస, ఎమ్​ఐఎమ్​ పార్టీల నాయకులు రౌడీలుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఉపవాస దీక్ష చేపట్టారు.

hunger protest in bjp state office nampally
'బండి'​పై దాడికి నిరసనగా ఉపవాస దీక్ష

By

Published : Dec 1, 2020, 11:44 AM IST

తెరాస, మజ్లీస్ పార్టీల నాయకులు రౌడీలుగా ప్రవర్తిస్తూ బండి సంజయ్​పై దాడికి యత్నించారని భాజపా నేతలు లక్ష్మణ్, డీకే అరుణ ఆరోపించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగం, పోలీసుల పక్షపాతం, ఎన్నికల కమిషన్ వైఫల్యాలను నిరసిస్తూ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, అరుణ, మాజీ ఎంపీ వివేక్ ఉపవాస దీక్ష చేపట్టారు.

తండ్రీ కొడుకులు అధికార దుర్వినియోగంతో గెలువాలని చూస్తున్నారని లక్ష్మణ్​ మండిపడ్డారు. ఐటీ హబ్​గా పేరు గాంచిన గ్రేటర్​ నగరాన్ని తెరాస నాయకులు గల్లీ నగరంగా పోల్చారని పేర్కొన్నారు. ప్రజలు మాత్రం అన్ని విషయాలు గమనిస్తున్నారని.. హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.

'బండి'​పై దాడికి నిరసనగా ఉపవాస దీక్ష

ఇదీ చదవండి:ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: మేయర్​

ABOUT THE AUTHOR

...view details