mass national anthem singing: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నేడు సామూహిక జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు జరుగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హైదరాబాద్ అబిడ్స్ జీపీవో కూడలి వద్ద జాతీయ గీతాలాపనలో పాల్గొననున్నారు. హైదరాబాద్లోని ఆబిడ్స్ జీపీఓ సర్కిల్, నెక్లెస్ రోడ్డు కూడలి ప్రాంతాల్లో ఏర్పాట్లను సీఎస్ సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. జీపీవో సర్కిల్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు, రంగుల బ్యానర్లు మైకులు ఏర్పాటు చేయాలని అధికారులకు సోమేష్ కుమార్ ఆదేశించారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన
mass national anthem singing స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నేడు సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి ఇప్పటికే అన్నిశాఖలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఉదయం పదకొండున్నరకు అన్ని కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు.
ఆ సమయంలో రెడ్ సిగ్నల్:ఈ కార్యక్రమం కోసం ట్రాఫిక్ పోలీసులు ఇవాళ ఉదయం పదకొండున్నరకు అన్ని కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. జాతీయ గీతాలాపన ముగిసే వరకు వాహనాలన్ని కూడళ్ల వద్ద నిలిపివేయనున్నారు. వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులూ జాతీయగీతాన్ని ఆలపించనున్నారు. సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నియమాలను చెప్పేందుకు ఏర్పాటు చేసిన మైకుల్లోనూ జాతీయ గీతం వినిపించనున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీ రంగనాథ్ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు సూచనలు చేశారు. సామూహిక జాతీయ గీతాలాపన ముగిసిన తర్వాత వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిగ్నళ్లను నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి..