ప్రజల సహకారంతోనే కొవిడ్‌ను నివారించగలమని హోం మంత్రి మహమూద్ అలీ అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ప్లాస్మా దాతలను హోం మంత్రి సన్మానించారు. ఇతరుల బాగుకోసం ప్లాస్మా దానం చేసిన దాతలకు హోంమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో సామాజిక బాధ్యతగా పోలీసులు సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. పోలీసు శాఖకు అన్ని సదుపాయాలు కల్పించామన్న హోంమంత్రి... రాష్ట్ర పోలీసుల పనితీరును అమిత్‌షా సైతం మెచ్చుకున్నారని పేర్కొన్నారు.
'ప్లాస్మా దానం చేసిన వారందరికి కృతజ్ఞతలు' - plasma news
సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ప్లాస్మా దాతలను సజ్జనార్‌తో కలిసి హోం మంత్రి మహమూద్ అలీ సన్మానించారు. ప్లాస్మా దానం చేసిన పోలీస్ సిబ్బందికి మహమూద్ అలీ అభినందనలు తెలిపారు. కొవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదని మహమూద్ అలీ ధైర్యం చెప్పారు.
ముందు ఆలోచనతో సైబరాబాద్ పోలీసులు రక్తాన్ని సేకరించి తలసేమియా రోగుల గురించి ఆలోచించారని ప్రశంసించారు. కొవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదని మహమూద్ అలీ తెలిపారు. వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని మహమూద్ అలీ కోరారు.
ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరూ దేవునితో సమానమని కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. లాక్‌డౌన్ సమయంలో సైబరాబాద్ పోలీసులు 5300బ్లడ్ యూనిట్లు సేకరించారని సీపీ వెల్లడించారు. 600మంది ప్లాస్మా దానం చేసి 1350మంది ప్రాణాలు కాపాడారని ఆనందం వ్యక్తం చేశారు. ప్లాస్మా దానంలో వాలంటీర్ల పాత్ర కీలకంగా మారిందన్నారు. ప్లాస్మా దానంలో తెలంగాణ మిగిలిన రాష్ట్రాలలో ఆదర్శంగా నిలిచిందని సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు.