రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన నిరుపేద ఎల్లవ్వకు 24 గంటల్లో ప్రభుత్వం భరోసా కల్పించకపోతే.. కాంగ్రెస్ పార్టీ ఇల్లు నిర్మిస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఆ పార్టీ స్థానిక నేతలు పూనుకున్నారు. ముగ్గు పోసి.. స్థలం చదును చేసే పనులను గురువారం ప్రారంభించారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్-అలియాబాద్ రహదారి విస్తరణలో గూడు కోల్పోయి రేకుల ఇంటిలో ఉంటున్న లక్ష్మాపూర్‌కు చెందిన కుమ్మరి ఎల్లవ్వ.. దీనస్థితిని రచ్చబండ కార్యక్రమానికి ఇటీవల వచ్చిన రేవంత్‌రెడ్డి చూశారు.
రేవంత్‌రెడ్డి హామీతో ఎల్లవ్వకు ఇల్లు... నిర్మాణానికి శ్రీకారం... - రేవంత్‌రెడ్డి తాజా వార్తలు
రోడ్డు నిర్మాణ పనులలో ఇల్లు కోల్పోయిన ఎల్లవ్వకు ప్రభుత్వం భరోసా కల్పించకపోతే.. కాంగ్రెస్ పార్టీ ఇల్లు నిర్మిస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నేరవేర్చేందుకు ఆ పార్టీ స్థానిక నేతలు ముందుకువచ్చారు. ముగ్గు పోసి... స్థలం చదును చేసే పనులను గురువారం ప్రారంభించారు.
రోడ్డు ఎత్తును పెంచడంతో తన ఇల్లు పూర్తిగా కూలిపోయిందని ఆమె వాపోయారు. దీనికి ఆయన స్పందించి.. 24 గంటల్లో ఎల్లవ్వకు ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ.. రూ.5 లక్షలను ఖర్చు చేసి ఇల్లు నిర్మిస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. ఇది జరిగి రెండు రోజులైనా అధికారులు, ప్రభుత్వం స్పందించలేదు. పీసీసీ ఆదేశాలతో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, తోటకూర వజ్రేష్‌యాదవ్ తదితర నేతలు ఇంటి నిర్మాణ పనులను చేపట్టారు. మూడు నెలల్లో ఆమెతో గృహప్రవేశం చేయిస్తామని పేర్కొన్నారు.