తెలంగాణ

telangana

ETV Bharat / city

మారనున్న ఓఆర్ఆర్​ రూపురేఖలు... అన్ని వసతులతో మరిన్ని వన్నెలు - hmda works in orr

హైదరాబాద్​ బాహ్యవలయ రహదారి సరసన మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని హెచ్​ఎండీఏ నిర్ణయించింది. ఓఆర్ఆర్ ఇంటర్ ఛేంజ్​ల వద్ద విశ్రాంతి అతిథి గృహాలు, ఇంధన కేంద్రాలు, పిల్లలకు క్రీడా మైదానాలు నెలకొల్పాలని భావిస్తోంది. మొత్తం 19 ఇంటర్ ఛేంజ్​ల వద్ద అభివృద్ధి చేయాలని నిర్ణయించగా... అందులో మొదటగా 8 కేంద్రాలను చేయనున్నారు. దీనికి సంబంధించి ఔత్సాహిక సంస్థల కోసం హెచ్ఎండీఏ టెండర్లను పిలిచింది.

hmda planning to relax centers on orr inter change places
మారనున్న ఓఆర్ఆర్​ రూపురేఖలు... అన్ని వసతులతో మరిన్ని వన్నెలు

By

Published : Oct 11, 2020, 5:26 PM IST

హైదరాబాద్ జంట నగరాల చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల రూపురేఖలు మార్చాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. బాహ్యవలయ రహదారి వెంట ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని ఆలోచిస్తోంది. పబ్లిక్​ ప్రైవేట్ ​పార్ట్​నర్​షిప్ ప్రాతిపదికన ఆధునాతన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్ ​మెట్రో పాలిటన్ అభివృద్ధి అథారిటీ నిర్ణయించింది.

ఇంటర్​ఛేంజ్​ల వద్ద సౌకర్యాలు...

రింగ్​రోడ్డులోని ఇంటర్​ఛేంజ్​ల వద్ద గల ఖాళీ స్థలాల్లో 10 నుంచి 20 ఎకరాల్లో ప్రయాణీకుల అవసరాలకు అనుగణంగా విశ్రాంతి, అతిథి గృహాలు, ఇంధన కేంద్రాలు , షాపింగ్, పార్కింగ్, పిల్లలకు క్రీడా మైదానాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీని కోసం ఔత్సాహిక సంస్థల కోసం హెచ్ఏడీఏ టెండర్లు ఆహ్వానించింది. రింగు రోడ్డుపైకి వెళ్లే మార్గాలు... ఆ రహదారి పైకి నుంచి కిందకు దిగే ప్రాంతాల ప్రయాణికులకు సేదతీర్చే కేంద్రాలుగా మారనున్నాయి.

సన్నాహాల్లో నిమగ్నమైన అధికారులు...

ఔటర్ రింగు రోడ్డు వెంట ఉన్న 19 ఇంటర్ ఛేంజ్​ల వద్ద వినూత్న రీతిలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. గత కొన్ని రోజులుగా వాటి రూపకల్పనలో అధికార యంత్రాంగం పలు దఫాలు ఓఆర్ఆర్ వెంట తిరిగి ప్రయాణికులకు కావాల్సిన సేవలపై చర్చింది. ఓఆర్ఆర్ వెంట ఉన్న ఇంటర్ ఛేంజ్​ల వద్ద పబ్లిక్​ ప్రైవేట్ ​పార్టనర్​షిప్ ​మోడల్​లో మల్టీ ఫ్యూయల్​ స్టేషన్స్, కమ్​వేసైడ్​ఎమినిటీస్​ ఏర్పాట్లకు ప్రతిపాదనలు రూపొందించిన ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వాటిని కార్యాచరణలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన సన్నాహాల్లో హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్​అధికారులు నిమగ్నమయ్యారు. ఓఆర్ఆర్ పరిధి​లో మొత్తం 19 ఇంటర్ ఛేంజ్​లు ఉండగా.... ప్రాథమికంగా 8 చోట్ల మల్టీ ఫ్యూయల్​ స్టేషన్స్ కమ్ వేసైడ్ ఎమినిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అవసరాలకు అనుగుణంగా...

ఓఆర్ఆర్ ఇంటర్ ఛేంజ్​ల వద్ద ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. పెట్రోల్​, డీజిల్​, సీఎన్జీ, బ్యాటరీ ఛార్జింగ్​ వంటి మల్టీ ఫ్యూయల్​ స్టేషన్లతో పాటు ఆహార కేంద్రాలు, శౌచాలయాలు ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు లోకల్​ హాండీక్రాఫ్ట్స్​ అవుట్​ లెట్, నిత్యావసర సరుకులు, మెడికల్ దుకాణాలు, కార్లు, బస్సులు, ట్రక్కుల కోసం పార్కింగ్​ సదుపాయాలు, వెహికిల్​ సర్వీస్​ సెంటర్లు, ఇంటర్ సిటీ బస్ టర్మినల్స్, ఆఫీస్​ బిల్డింగ్స్​ తదితర వాటిని దశలవారీగా ఏర్పాటు కానున్నాయి.

పటాన్​చెరు, మేడ్చల్​, శామీర్​పేట్​, ఘట్​కేసర్, పెద్ద అంబర్​పేట్​, బొంగులూరు, నార్సింగి, పోలీస్​అకాడమీ ప్రాంతాల్లో మొదటి దశలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

ABOUT THE AUTHOR

...view details