తెలంగాణ

telangana

ETV Bharat / city

సమర యోధుల సంస్థ అధ్యక్షుడి మృతిపై దత్తాత్రేయ సంతాపం - స్వాతంత్య్ర సమర యోధుల సంస్థ అధ్యక్షుడు మృతిపై దత్తాత్రేయ సంతాపం

స్వాతంత్య్ర సమర యోధుల సంస్థ అధ్యక్షుడు బాబురావు మృతిపై హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జాతీయ భావాలు నిండుగా ఉన్న గొప్పవ్యక్తి బాబురావని కొనియాడారు.

himachal pradesh governor bandaru dattatreya
సమర యోధుల సంస్థ అధ్యక్షుడి మృతిపై దత్తాత్రేయ సంతాపం

By

Published : Sep 2, 2020, 7:19 AM IST

స్వాతంత్య్ర సమర యోధుల సంస్థ అధ్యక్షుడు, జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ మాజీ సభ్యుడు బాబురావు వర్మ మృతి పట్ల హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

బాబురావు వర్మ మృతి పట్ల.. అతని కుమారుడు బూసాని వెంకటేశ్వర్​రావుతో దత్తాత్రేయ ఫోన్​లో మాట్లాడారు. వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తనకు చాలా సన్నిహితులుగా ఉన్న వారిలో బాబురావు వర్మ ఒక్కరని దత్తాత్రేయ అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి బీసీల రిజర్వేషన్లపై పోరాడారని కొనియాడారు.

స్వాతంత్య్ర పోరాటం, నిజాం వ్యతిరేక ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారని గుర్తుచేసుకున్నారు. సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా బాబురావు ఉన్నారన్న దత్తాత్రేయ.. జాతీయ భావాలు నిండుగా నింపుకున్న గొప్ప వ్యక్తి కొనియాడారు.

ఇవీచూడండి:మళ్లీ అదే కథ.. చొరబాటుకు చైనా విఫలయత్నం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details