మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ కొన్ని సంఘాల వారు... తెదేపా నేతల దిష్టిబొమ్మలు ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు వైకాపా నేతల దిష్టిబొమ్మలు పెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంశంపై పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. బుధవారం లోపు అక్కడి దిష్టిబొమ్మలను తీయిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
మందడం దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత - amaravati farmers protest latest news
మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. వైకాపా నేతల దిష్టిబొమ్మలు పెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
మందడం దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
ఇదీ చదవండి:పట్టభద్రుల ఓటర్ల జాబితాకు కొత్త షెడ్యూల్