తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ap high court
ap high court

By

Published : Apr 6, 2021, 3:59 PM IST

Updated : Apr 6, 2021, 4:49 PM IST

15:58 April 06

ఏపీలో పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఏపీలో పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్‌ విధించలేదని ఆక్షేపించింది. తెదేపా, భాజపా, జనసేన, మరికొందరి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

కోడ్‌ విషయంలో 4 వారాల గడువు నిబంధన పాటించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవటం సరికాదని తెలిపారు. ఎస్ఈసీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. నోటిఫికేషన్ తర్వాత కొంత సమయం ఉండాలని పిటిషనర్లు తెలిపారు. తక్కువ సమయంలో ఏర్పాట్లు చేసుకోలేమన్నారు. ప్రచారం కోసం నెల గడువు ఉండాలని కోరారు. ఇది కొత్త నోటిఫికేషన్‌ కాదని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆగిపోయిన ప్రక్రియను కొనసాగిస్తున్నామని కోర్టుకు తెలిపారు.

ఇదీ చదవండి :ఠాణాలో పోలీసుల నాగిని డ్యాన్సులు

Last Updated : Apr 6, 2021, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details