రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలపై ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని సూచించింది. హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జరిగిన విచారణకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు హాజరయ్యారు. కేసులకు సంబంధించిన సమాచారం మీడియా బులెటిన్‌లో పొందుపర్చాలని సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కరోనా కేసులు వెల్లడించి, కాలనీ సంఘాలకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. రాష్ట్రంలో 79మంది వైద్యులకు వైరస్ సోకినట్టు న్యాయస్థానానికి ప్రజా ఆరోగ్యశాఖ వివరించింది.
కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు - కరోనా కేసుల సమాచారం
14:36 June 18
కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు
గాంధీలో ప్లాస్మా, యాంటీవైరల్ డ్రగ్స్ ప్రయోగాలు జరుగుతున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదించారు. ర్యాపిడ్ యాంటీజెంట్ టెస్ట్ నిర్వహించాలన్న ఐసీఎంఆర్ సూచనలు పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. 54 ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపింది. సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో ప్రభుత్వం వివరించాలన్న హైకోర్టు... లక్షణాలులేని ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితోపాటు పోలీసులకు రక్షణ కిట్లు ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిబ్బందికి షిఫ్ట్‌ల విధానం అమలు చేయాలని చెప్పింది. న హైకోర్టు... ఈనెల 29లోగా నివేదిక సమర్పించాలని సర్కారును ఆదేశించింది.
ఇదీ చూడండి:'రథయాత్రకు అనుమతిస్తే జగన్నాథుడు క్షమించడు'