ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు, నార్సింగి ఇన్స్పెక్టర్ గంగాధర్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారన్న ఆరోపణలతో తనపై నమోదైన కేసులో పోలీసు అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఆర్పీసీ 41 ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు... నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
రేవంత్‌రెడ్డి కేసులో పోలీసులకు నోటీసులు.. వివరణ ఇవ్వాలన్న హైకోర్టు
సుప్రీంకోర్టు తీర్పను ధిక్కరించి... పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని మాదాపూర్ ఏసీపీ, నార్సింగి ఇన్స్పెక్టర్కు నోటీసులు జారీ చేసింది.
రేవంత్ రెడ్డి కేసులో పోలీసులకు హైకోర్టు నోటీసులు