ఆర్టీసీ కార్మికుల వేతనాలపై హైకోర్టులో విచారణ జరిగింది. వేతన చట్టం ప్రకారం వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉందని అదనపు ఏజీ వాదించారు. ఒక్కరోజు గైర్హాజరయితే 8 రోజుల వేతనం మినహాయించుకునే అధికారం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పనిచేసిన సెప్టెంబరు నెల వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది వాదించారు. వేతనాలపై కార్మిక న్యాయస్థానానికి వెళ్లాలని.. హైకోర్టుకు కాదని అదనపు ఏజీ పేర్కొన్నారు. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉంది: అదనపు ఏజీ - undefined
tsrtc
12:06 November 27
వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉంది: అదనపు ఏజీ
Last Updated : Nov 27, 2019, 2:36 PM IST