భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణకు అభినందనలు తెలియజేస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అభినందనలు - హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏకగ్రీవ తీర్మానం వార్తలు
భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణకు.. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అభినందనలు తెలియజేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ఈ నెల 8న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లు కార్యదర్శి పీటా రామన్ తెలిపారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ఈ నెల 8 న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లు కార్యదర్శి పీటా రామన్ తెలిపారు. మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు ఏపీ బార్ కౌన్సిల్ మోడల్ బైలాను వర్తింపజేసుకున్నామని పేర్కొన్నారు. న్యాయవాదుల సంఘానికి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అధ్యక్షులు వైవీ రవిప్రసాద్, ఉపాధ్యక్షులు జీఎల్ నాగేశ్వరరావు, కార్యదర్శి జేయూఎంవీ ప్రసాద్ సమర్పించిన రాజీనామాలను తిరస్కరించామని వెల్లడించారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విషయంలో మరికొన్ని తీర్మానాలు చేశామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:మానవత్వాన్ని చంపేసిన కరోనా!
TAGGED:
Justice N.V.Ramana