తెలంగాణ

telangana

ETV Bharat / city

maa elections: అందుకే శివబాలాజీ చేయి కొరికా: హేమ - శివబాలాజీ చేయి కొరికిన హేమ

'మా' ఎన్నికల పోలింగ్​ సందర్భంగా సినీనటి హేమ చేసిన పని హాట్​ టాపిక్​గా నిలిచింది. ప్రకాశ్​రాజ్​, విష్ణు వర్గీయులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ప్రకాశ్​రాజ్​ ప్యానెల్​ తరఫున ఓ వ్యక్తి అనుమతి లేకుండా లోనికి చొరబడి ప్రచారం చేస్తున్నాడని విష్ణు వర్గీయులు అతనిపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. ప్రకాశ్​ ప్యానెల్​ నుంచి బరిలో నిలిచిన హేమ... వారిని అడ్డుకునేందుకు ముందుకు వెళ్తుండగా.. శివబాలాజీ చేయి అడ్డంపెట్టి ఆమె వెళ్లకుండా నిలుచున్నాడు. వెనకే ఉన్న హేమ.. కోపంతో శివబాలాజీ చేయి కొరికింది. ఈ దృశ్యం మీడియా కెమెరాల్లో రికార్డయింది.

hema bites shiva balaji hand in maa elections
hema bites shiva balaji hand in maa elections

By

Published : Oct 10, 2021, 6:15 PM IST

'తాను వెళ్తున్న సమయంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టారని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ అన్నారు. దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా సాగిన్నట్లు హేమ పేర్కొన్నారు.

ఇక తనకూ బెనర్జీకి ఎలాంటి గొడవ జరగలేదని నటుడు శివబాలాజీ అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తుంటే వాగ్వాదం మాత్రమే జరిగినట్లు తెలిపారు. హేమ కొరికిన విషయాన్ని నో బైటింగ్..​ ఓన్లీ ఓటింగ్​' అంటూ' తేలిగ్గా కొట్టి పారేశారు.

శివబాలాజీ చేయి కొరికిన హేమ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ 'మా' ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా పూర్తయింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈసారి 'మా' సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఏడాది మొత్తంగా 665 మంది ఓటు వేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్రకథానాయకులతోపాటు గిరిబాబు, చలపతిరావు, బాబుమోహన్‌, బ్రహ్మానందం వంటి సీనియర్‌ నటులు, రోజా, జయప్రద, జెనీలియా, అఖిల్‌, నాని.. ఇలా ఎంతో మంది సినీ తారలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విక్టరీ వెంకటేశ్‌, మహేశ్‌బాబు, తారక్‌, ప్రభాస్‌, రానా, నితిన్, నాగచైతన్య, అల్లు అర్జున్‌, శర్వానంద్‌, సునీల్‌, సుమంత్‌, సుశాంత్‌, సత్యదేవ్‌, అల్లు శిరీష్, వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, రవితేజ, అనుష్క, రకుల్‌, త్రిష, హన్సిక, ఇలియానా, నిహారికతోపాటు పలువురు తారలు ఓటు వేయలేదు.

ఇదీ చూడండి:Rakul preet singh birthday: ఆ నటుడితో రిలేషన్​లో రకుల్​ప్రీత్

ABOUT THE AUTHOR

...view details